ఈ నాలుగు రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్త సుమా!-these four zodiac signs will mostly affected with evil eye be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ నాలుగు రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్త సుమా!

ఈ నాలుగు రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్త సుమా!

Peddinti Sravya HT Telugu

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. దురదృష్టం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అనేది తెలుసుకుందాం.

ఈ నాలుగు రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది (pinterest)

రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. ఒక్కో రాశి వారి స్వభావం, తీరు ఒక విధంగా ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. దురదృష్టం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది:

1.తులా రాశి

తులా రాశి వారు ఆకర్షణగా కనిపిస్తారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బహుముఖ ప్రతిభ కారణంగా ప్రతికూల శక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటివి కలగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు సాహసవంతులు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇది ఇతరులను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ అసూయకి దారి తీస్తుంది. అందువల్ల సింహ రాశి వారు నరదృష్టికి ఎక్కువగా గురవుతారు.

3.మిధున రాశి

మిధున రాశి వారు చాలా చురుకుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొందరిలో అసూయను కలిగిస్తుంది. నరదృష్టి తగలకుండా ఉండాలంటే పసుపు రంగు బ్యాండ్ గాని, గొలుసు గాని వేసుకోవడం మంచిది.

4.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్లు ప్రతిదానినీ జాగ్రత్తగా గమనిస్తారు. ఇది ఇతరులకు అసూయ కలిగించేలా చేస్తుంది. దీని వల్ల ఈ రాశి వారు నరదృష్టికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.