జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఎంతో మంచిది. అలాగే సూర్యసంచారం కూడా ఒక్కొక్కసారి ఒక్కో రాశిపై మంచి ఫలితాలను చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో సూర్యుడు, శని, కుజుడు, బుధుడు వంటి ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి. దీనివల్ల 12 రాశులపై ప్రభావం పడుతుంది.
సూర్యుడు రాశిచక్రంలో మార్పు అనేది ముఖ్యంగా కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సూర్యభగవానుడు ఏప్రిల్ 14న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహరాశికి అధిపతి. అలాగే గ్రహాలకు కూడా రాజు. సూర్యుడిని భక్తితో పూజిస్తే ఆ వ్యక్తి కోరికలు నెరవేరుతాయి అని కూడా నమ్ముతారు.
ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎన్నో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. శుభ సమయం కూడా వస్తుంది. ఈ సూర్య సంచారమనేది నాలుగు రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
సూర్యుడు మీ రాశిలోకి నేరుగా ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇది మీలో కొత్త శక్తిని నింపుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే సూర్య భగవానుడి దయవల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ ను సాధిస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి చెందే సంకేతాలు అధికంగా ఉన్నాయి. సూర్య భగవానుడి దయతో మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. నిరుద్యోగుల కలలు నెరవేరుతాయి.
సూర్యుని సంచారం మిథున రాశి జాతకులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారి కెరీర్ ఊపందుకునేలా చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా శుభాలు కలుగుతాయి. సూర్య అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతిని పొందుతారు. అలాగే ఉద్యోగుల జీతం కూడా పెరగొచ్చు. పోటీ పరీక్షలలో విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాగే పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు అధికంగా వస్తాయి. వ్యాపారులకు కూడా లాభాలు తగ్గుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. మానసిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.
కర్కాటక రాశి వారికి కూడా సూర్యుని గమనం శుభప్రదంగా మారుతుంది. ఈ రాశి వారికి సామాజిక, ఆర్థిక రంగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన వేడుకల్లో హాజరవుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు పూర్తవకుండా మిగిలిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కచ్చితంగా వస్తుంది. సంపద పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీతో పాటే ఉంటాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
తులారాశి వారికి సూర్య సంచారం ఆస్తిని అందించేలా కనిపిస్తోంది. అలాగే మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. సూర్య సంచారం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా వస్తుంది. అలాగే భూమి, వాహనం లేదా ఆభరణాలు కొనుగోలు కూడా చేసే అవకాశం కల్పిస్తుంది. ఇక పూర్వం నుంచి వస్తున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇక వ్యాపారం చేసేవారు ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. డబ్బు అధికంగా సంపాదించే అవకాశం ఉంది.
(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.)