న్యూమరాలజీ ఎన్నో విషయాలను చెప్తుంది. న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలని కూడా చెప్పవచ్చు. ఒక్కో మనిషి తీరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. న్యూమరాలజీ బట్టి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి వంటి ఆసక్తికరమైన విషయాలని తెలుసుకోవచ్చు.
న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యలు వాళ్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. అందరూ ప్రేమిస్తారు. కానీ ప్రేమను నిలబెట్టుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రేమలో విజయం అందుకోవాలంటే, రెండు వైపుల నుంచి కూడా ప్రేమ ఉండాలి. ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడాలి. అప్పుడే ఆ ప్రేమ నిలబడుతుంది.
3,12, 21 తేదీల్లో పుట్టిన వారు ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యలో పుట్టిన వారు ఇతరులని సులువుగా ఆకట్టుకోగలుగుతారు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీళ్ళు ప్రేమలో పడిన తర్వాత కచ్చితంగా వారిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
5,14, 23 తేదీల్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు రొమాంటిక్ గా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ప్రేమని పెళ్లిగా మార్చడానికి ఆలోచిస్తూ ఉంటారు.
6,15, 24 తేదీల్లో పుట్టిన వారు ప్రేమ విషయంలో సెన్సిటివ్ గా ఉంటారు. ఎమోషనల్ గా ఇతరులతో కనెక్ట్ అయ్యి ఉంటారు. ప్రియుడు లేదా ప్రేయసి తో మంచి రిలేషన్ షిప్ లో ఉంటారు. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత జీవితాంతం కలిసి ఉండాలని.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
9,18, 27 తేదీల్లో పుట్టిన వారు మొండిగా ఉంటారు. అసలు దేనిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే వరకు పోరాడుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్