Couragious Zodiac Signs: ధైర్యానికి పెట్టింది పేరు ఈ ఐదు రాశుల వారు, మీరు కూడా ఇందులో ఒకరేమో చెక్ చేసుకోండి!
Couragious Zodiac Signs: ధైర్యానికి రూపాలెన్నో..! తెగువ చూపించి ముందుకు అడుగేయడం. తప్పును వేలెత్తి చూపడం, ఎంత కష్టమొచ్చినా ఓర్చుకుని నిలబడగలగడం వంటివి లక్షణాలు. ఏదైమైనా ధైర్యం అనేది అందరిలో ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ధైర్యం ఎక్కువట.ఆ వారెవరో చూద్దాం.
ధైర్యం అనే పదాన్ని వివరించి చెప్పడం కాస్త కష్టమైన పనే అయినా.. అది బయటకు కనిపించిన సమయంలో ప్రతి ఒక్కరి కళ్లలో నిలిచిపోయే ఉంటుంది. కొన్నిసార్లు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేయాలి. అదే కొన్నిసార్లు పెదవి బిగువున బాధను నొక్కిపట్టి ధైర్యంగా నిలబడాలి. పరిస్థితిని చూసి వెనక్కి తగ్గడం, మనస్సులో భావాలతో రాజీ పడాలనుకోకపోవడం వంటివన్నీ కూడా ధైర్యస్థుల లక్షణాలే. ఒక్కో రాశివారికి ఒక్కో రకమైన ధైర్యపు లక్షణాలు ఉంటాయట. జ్యోతిష్య శాస్త్రం భయమనేదే లేని ఐదు రాశుల గురించి ఏం చెబుతుందంటే.
1. మేషం:
ఈ రాశి వారు ఎలాంటి వారంటే, ఏ ఆందోళన లేకుండా ముందుకు దూసుకుపోతారు. ఈ గ్రహానికి అధిపతి అయిన అంగారక గ్రహ అనుగ్రహంతో, కొత్త సవాళ్ళను ఎదుర్కొనే ఉత్సాహంతో ఉంటారు. ప్రమాదాలను ఎదుర్కోవడంలో ఎలాంటి భయానికి లోనవకుండా ఉంటారు. మేషరాశి వారి జీవితమే ఒక సాహస ప్రయాణం. చివరిదాకా ఎదురుచూస్తూ కూర్చొని ఎవరోఒకరు సమస్యను పరిష్కరిస్తాని చూసే శైలి కాదు. సమస్యకు ఎదురు తిరిగి బలంగా నిలబడి పోరాడగలిగే సామర్థ్యం ఉన్నవారు. ఏదైనా కష్ట సమయంలో ఘోర వైఫల్యం చెందినప్పుడు తిరిగి తమకు తాముగా ధైర్యం చెప్పుకుని నిలబడగలిగే వారు మేష రాశి. వైఫల్యాలను ప్రయాణంలో భాగమే కానీ, అది ముగింపు కాదని భావిస్తుంటారు. ఓటమికి భయపడి ఆగిపోకూడదని నిత్యం తపిస్తుంటారు.
2. సింహం
ఈ రాశి వారు పేరుకు తగ్గట్టుగానే వారిలోని ధైర్యమనే లక్షణం కనిపించకుండా ఉండదు. ఈ రాశి వారిపై సూర్యానుగ్రహం ఉండటం చేత ఏ విషయంలోనైనా ఉన్నత నిర్ణయం తీసుకుంటారు. తమ కోసమైనా, తమకు కావాల్సిన వారి కోసమైనా అది చాలా కరెక్ట్‌గా ఉంటుంది. సింహ రాశి వారు సవాళ్లను ఎదుర్కోవడంలో వెనక్కి తగ్గరు. ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వారు వ్యవహరించే తీరు ఇతరులకు స్ఫూర్తిధాయకంగా ఉంటుంది. తమ కోసం మాత్రమే ధైర్యంగా ఉండకుండా, ప్రేమించిన వారి కోసం, ఆప్తులు అనే వారందరి కోసం ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉంటారు.
3. వృశ్చికం
వృశ్చిక రాశి ధైర్యం భిన్నమైనది. మిగతా రాశుల మాదిరిగా పైకి సుస్పష్టంగా కనిపించేది కాదు. సమయానుకూలంగా పరిస్థితులపై ప్రతిఘటిస్తుంది. ప్లూటో గ్రహం అనుగ్రహంతో ఉండటం చేత వారి అంతర్గత బలం వేరే ఉంటుంది. జీవితంలో తారసపడిన కఠినమైన క్షణాలను ఎదిరించి ముందుకు సాగడంలో సహాయపడుతుంది. బాధకరమైనప్పటికీ ఉపయోగపడని విషయం అనిపిస్తే, వాటిని వాటిని విడిచిపెట్టేందుకు వెనుకాడరు. సౌకర్యంగా ఉండటం కంటే విజయం కోసం కష్టపడటాన్నే ఇష్టపడతారు. వీరెలాంటి వారంటే, ధైర్యమంటే ఎల్లప్పుడూ బయటకు కనిపించేది కాదు. ఒకానొక సమయంలో వెనక్కి తగ్గడం కూడా ధైర్యమేనని నిరూపించేవారు వృశ్చిక రాశి వారు.
4. ధనుస్సు
ధనుస్సు రాశి వారి జీవితం ఓపెన్ బుక్ మాదిరిగా కనిపిస్తుంటుంది. దేవగురు గ్రహమైన బృహస్పతి వారిపై అనుగ్రహం చూపిస్తుండటంతో ప్రపంచాన్ని అవకాశాలతో నిండినదిగా చూస్తారు. వాటిని నిరూపించుకోవడానికి ప్రమాదాలంటే అస్సలు వెనక్కు తగ్గరు. ధనుస్సు రాశి వారు తప్పులు చేసి అక్కడితో ఆగిపోరు. ప్రయాణంలో భాగంగా భావించి ముందుకు వెళ్లిపోతుంటారు. వీరి ఆశావాదిత్వం అనుభవించడమే కాకుండా మనకు బోధిస్తుంటారు. పరిధులు దాటి ప్రయత్నిస్తే కొన్ని అద్భుతమైన అనుభవాలకు చేరుకోవచ్చని నిరూపిస్తారు.
5. మకరం
మకర రాశి వారి ధైర్యం వెంటనే కనిపించకపోయినా అది వారు పని ముగించే తీరులో కనిపిస్తుంది. మొండి పట్టుదల, అంకిత భావంతో వ్యవహరిస్తుంటారు. శని గ్రహం అనుగ్రహం ఉండటం చేత నిరంతర అధ్యయనం చేస్తూనే ఉంటారు. జీవితంలో ఎత్తుపల్లాలను, కష్టనష్టాలను దాటుకుని ముందుకు వెళుతుంటారు. వీరి సహనమే ఈ రాశి వారికి శక్తిగా ఉంటుంది. ధైర్యం ఎప్పుడూ దూకుడుగానే ఉండదని కొన్నిసార్లు ప్రతిరోజూ చేసే పనిలో అలసత్వం లేకపోవడం కూడా అదేనని గుర్తు చేస్తుంటారు. వారి ఉద్దేశ్యాన్ని బలంగా నమ్మి చివరికి కృషితో పనులు పూర్తి చేయగలరు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.