Goddess lakshmi devi: ఆర్థిక సమస్యలకు తీరడానికి, ధనలాభం కలగడానికి ఆచరించాల్సిన మార్గాలు ఇవే
Goddess lakshmi devi: ఆర్థిక సమస్యలు తీరిపోయేందుకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Goddess lakshmi devi: ఏ మానవునికైనా ధనపరమైనటువంటి సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలకు కారణాలను అన్వేషించి పరిహారము గనుక చేసుకున్నట్లయితే అటువంటి సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధనపరమైన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పొందేటటువంటి వారికి జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కొన్ని నియమాలను ఆచరించడం వలన కష్టాలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
1. ప్రతీ రోజూ స్నానమును ఆచరించడం. స్నానానంతరం దీపాలను వెలిగించడం వలన అలక్ష్మి తొలగుతుంది.
2. శనివారం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం.
3. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం.
4. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం లేదా గురువారం రోజు పారాయణ చేయటం .
5. శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం శుక్రవారం రోజు పఠించుకోవడం.
6. ఆవు నెయ్యితో లక్ష్మీ విగ్రహానికి అభిషేకం చేసినచో ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
7. చెరుకురసముతో లక్ష్మీ విగ్రహానికి అభిషేకము చేసిన చోధన వృద్ధి కలుగును.
8. సువర్ణ జలముతో లక్ష్మీ విగ్రహానికి అభిషేకము చేసినచో దారిద్యనాశనము కల్గును.
9.మీ వ్యాపార సంస్థల యందు, ఆఫీసులయందు తూర్పు ముఖముగా కూర్చున్న ధనప్రాప్తి కలుగును.
10. మీ గృహమున ప్రతి గదిలో ఈశాన్యము ఖాళీ ఉంచి తూర్పు వైపు తేలికైన సామాన్లు ఉంచండి.
11. తెల్లని వస్త్రము పన్నీరులో తడిపి ఎండబెట్టి ఒత్తి చేసి శుక్రవారము దీపారాధన చేసినచో సకల సంపదలు తరలివచ్చును.
12. ఉత్తరం దిక్కుగా దీపారాధన చేస్తే అష్టైశ్వరాలు పొందుతారు.
13. గురువారం (లక్ష్మీవారం) ఐదువత్తులతో దీపారాధన చేసినచో అఖండ ఐశ్వర్యములు కలుగును.
14 శ్రీమహాలక్ష్మికి ప్రీతికరమైన ఆవునెయ్యితో దీపారాధన శుక్రవారం చేసినచో ధనప్రాప్తి కలుగును.
15.మీ రుణబాధలు తొలగుటకు శ్రీసాయిసచ్చరిత్ర 9 మార్లు పారాయణం చేస్తూ ప్రతి మంగళవారం 9 అప్పాలు నివేదన చేయండి.
16. మీకు ధనలాభము కొరకు శ్రీసాయి సచ్చరిత్ర 18 మార్లు పారాయణ చేస్తూ ప్రతి గురువారం కోవా నైవేద్యము చేయండి.
17. గణపతికి ప్రతి మంగళవారం జీలకర్ర, బెల్లం నివేదన చేయండి.
18. గణపతికి 70 అరగుంజీళ్ళు 40 రోజులు చేయండి.
19. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం 24మార్లు చేయండి.
20. ఆవునేతితో దీపారాధన చేసి 8 దీపాలు వెలిగించి అష్టలక్ష్మి స్తోత్రము పఠించడం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్