భగవద్గీత చెప్పిన ప్రకారం పుట్టిన వ్యక్తికి తప్పకుండా చావు ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అయితే మరణానికి దగ్గరైన వ్యక్తిలో కొన్ని రకాల లక్షణాలు సంకేతాలు కనిపిస్తాయిట. పురాణాలు చెబుతున్న ప్రకారం మరణించబోయే ముందు ఒక వ్యక్తికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
ఎవరైనా మరణానికి సమీపించినప్పుడు అతడి నాభి చక్రంలో మరణ కార్యకలాపాలు మొదట ప్రారంభమవుతాయి. ఎందుకంటే నాభిని శరీరానికి కేంద్రంగా పరిగణిస్తారు. పుట్టుక సమయంలో కూడా శరీరం ఏర్పడడం అనేది నాభిలోనే ప్రారంభమవుతుంది. ఈ కారణంగానే మరణం సమీపిస్తున్నప్పుడు కూడా మొదటి సంకేతం నాభి దగ్గరే అనుభూతి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి.
నాభి ప్రాంతంలో జరిగే మార్పులు మరణానికి దగ్గర అయ్యే వ్యక్తికి అర్థమవుతాయి. అది జీవితపు చివరి క్షణం గురించి ముందస్తుగానే సమాచారాన్ని అందిస్తుంది. ఈ సంకేతాలు శారీరక, మానసిక మార్పుల రూపంలో ఉంటాయి.
శివపురాణం చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి మరణానికి దగ్గరైనప్పుడు అతని కళ్ళు, నోరు, నాలుక, చెవులు, ముక్కు వంటివి గట్టిగా మందంగా మారడం ప్రారంభం అవుతాయి. రాయిలాగా అనిపిస్తాయి. ఈ అవయవాలు క్రమంగా పనిచేయడం తగ్గిస్తాయి. చివరికి శరీరం అంత్యదశకు చేరుకోగానే పనిచేయడం ఆగిపోతాయి. మరణానికి దగ్గరైన వ్యక్తికి ఈ అనుభూతి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు ఒకరి మరణానికి దగ్గరవుతున్నప్పుడు వారి శరీరం కూడా రంగు మార్చుకోవడం మొదలవుతుంది. నీలం లేదా పసుపు రంగులోకి తనను తాను మార్చుకుంటుంది. అలాగే అతను శరీరంపై కొన్నిచోట్ల ఎర్రటి గుర్తులు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మరణానికి చేరువవుతున్నాడని చెప్పే సంకేతాలే.
సాముద్రిక శాస్త్రం చెబుతున్న ప్రకారంగా ఒక వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైనప్పుడు ఆ వ్యక్తి నీడ కూడా అతడిని విడిచి పెట్టడం ప్రారంభిస్తుందని అంటారు. దీని అర్థం మరణానికి దగ్గర అయ్యే వ్యక్తికి నీడ ఏర్పడదు.
పురాణాలు చెబుతున్న ప్రకారం యమధర్మరాజు ఒక వ్యక్తి ఆత్మను తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి క్రమంగా సూర్యుడు, చంద్రుడు, అగ్నివంటి కాంతిని చూసే సామర్థ్యాన్ని కోల్పోతాడు. తన మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ధ్రువ నక్షత్రం అతనికి కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట అతనికి చుట్టూ మెరిసే నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమయంలో ఆ వ్యక్తి భూమిపై మరికొన్ని రోజులు మాత్రమే ఉంటాడని అర్థం.
శాస్త్రాలు చెబుతున్న ప్రకారం శరీరంలో నాభి మన ప్రాణ శక్తికి కేంద్రం లాంటిది. ఈ నాభి ద్వారానే బిడ్డ గర్భంలో పెరుగుతాడు. అతని జీవితం అభివృద్ధి చెందుతుంది. అయితే మరణం తర్వాత కూడా ఆత్మ శరీరాన్ని వదిలి వేసేటప్పుడు ఆ ప్రాణం నాభిలో ఒక ఆరు నిమిషాల పాటు ఉంటుందని చెబుతారు. దాని తర్వాత శరీరం మొద్దు బారిపోతుందనీ, ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందని చెబుతారు.
పైన చెప్పిన లక్షణాలు అన్నీ వివిధ పురాణాలు, శాస్త్రాలలో అక్కడక్కడ ప్రస్తావించినవి. వాటిని ఒక దగ్గర చేర్చి మీకు అందించాము.
(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.)
సంబంధిత కథనం