Lord shiva mantralu: మీ జీవితంలోని సమస్యలన్నింటినీ తొలగించే శక్తివంతమైన శివ మంత్రాలు ఇవే-these are powerful shiva mantras to remove all problems in your life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Shiva Mantralu: మీ జీవితంలోని సమస్యలన్నింటినీ తొలగించే శక్తివంతమైన శివ మంత్రాలు ఇవే

Lord shiva mantralu: మీ జీవితంలోని సమస్యలన్నింటినీ తొలగించే శక్తివంతమైన శివ మంత్రాలు ఇవే

Gunti Soundarya HT Telugu
May 07, 2024 04:35 PM IST

Lord shiva mantralu: జీవితంలో చేసిన పాపాలు, సమస్యలు అన్నింటినీ తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక పఠించాల్సిన శక్తివంతమైన శివుడి మంత్రాలు ఇవి. వీటిని నిత్యం జపించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది.

శక్తివంతమైన శివుడి మంత్రాలు
శక్తివంతమైన శివుడి మంత్రాలు (pixabay)

Lord shiva mantralu: హిందూమతంలో సృష్టికర్త, వినాశనకర్త రెండింటికి బాధ్యత వహించే ఏకైక దేవుడు పరమశివుడు. కొంచెం నీళ్లతో అభిషేకం చేసిన చాలు పరవశించిపోతాడు. ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం, సానుకూలత, సమృద్ధి, రక్షణ కోసం అనేక శ్లోకాలు మంత్రాలు శివుడికి అంకితం చేయబడి ఉన్నాయి. ప్రతి భక్తుడు పఠించాల్సిన ఐదు సులభమైన, శక్తివంతమైన శివమంత్రాలు ఇవి. వీటిని ప్రతిరోజు పఠించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

శివ గాయత్రీ మంత్రం

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాహ ప్రచోదయాత్

శివ గాయత్రీ మంత్రం శివునికి అంకితం చేసింది. శివ గాయత్రీ మంత్రాన్ని చిత్తశుద్ధితో జపించడం వల్ల ఆధ్యాత్మిక అంతర దృష్టి, జ్ఞానం, అంతర్గత పరివర్తన లభిస్తుందని నమ్ముతారు. నిజమైన ఉద్దేశాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. స్వీయ సాక్షాత్కారం చేసుకుంటూ సరైన మార్గంలో నడిచేందుకు ఉపయోగపడుతుంది.

ఓం నమో భగవతే రుద్రాయ

“ఓం నమో భగవతే రుద్రాయ నమః ” అనేది శివుడి రుద్ర మంత్రం. ఈ మంత్రం శివుని అవతారమైన ఉగ్రుడైన రుద్రుడుకు సంబంధించినది. రుద్ర భగవానుడు విశ్వం శక్తికి చిహ్నంగా కనిపిస్తాడు. అడ్డంకులను తొలగించుకునేందుకు ఈ రుద్ర మంత్రం పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో భక్తితో జపించడం వల్ల ఒక వ్యక్తి దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురు వారివి కమీవా బంధనం మృత్యోర్ముక్షీయ మామృతాత్

మహా మృత్యుంజయ మంత్రం అనేది ఒక వ్యక్తి మనసు నుంచి మరణ భయం, బాధని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, ప్రమాదాలు, అకాల మరణం నుండి రక్షణ పొందడం కోసం ఈ మంత్రం జపిస్తారు. మహా మృత్యుంజయ మంత్రాన్ని మృత సంజీవిని మంత్రం అని కూడా పిలుస్తారు. ఇది నిత్యం జపించడం వల్ల వ్యక్తికి పునరుజీవం ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. విశ్వాసంతో మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తే శివుని దివ్య స్వస్థత శక్తి అనుభవించవచ్చు. జనన మరణ చక్రం అనే భయం నుండి విముక్తి పొందుతారు.

ఓం నమః శివాయ

శివుడిని తలుచుకునేందుకు ఉత్తమమైన సులువమైన మంత్రాలలో ఒకటి ఓం నమః శ్శివాయ. ఇది సరళమైనది, శక్తివంతమైనది. దీని అర్థం నేను శివుడికి నమస్కరిస్తున్నాను. విశ్వం ఆదిమ ధ్వని ఓం శబ్దంతో ఈ మంత్రం ప్రారంభం అవుతుంది. ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా పఠిస్తే మనసు, శరీరం, ఆత్మ శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించే వ్యక్తులు విశ్వశక్తులను ఎక్కువగా స్వాగతిస్తారని అంటారు. ఈ మంత్రం దైవానికి సంబంధించిన బంధాన్ని గుర్తుచేస్తుంది. అంతర్గత శాంతి, బలం, జనన మరణ చక్రం నుంచి విముక్తి కోసం శని అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు.

శివోహం శివోహం

శివోహం అనే సాధారణ శ్లోకం హిందూ విశ్వాసాలను నియంత్రించే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ సరళమైన శ్లోకం పరమశివుని అంతిమసత్యంగా చెప్తారు. శివోహం అంటే నేను శివుడిని అని నమ్మడం. మితిమీరిన విశ్వాసం, అసూయతో కాకుండా ఒక వ్యక్తి తనను తాను శివునితో సమానమని కాకుండా శివుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని సూచిస్తుంది. శివోహం నిరంతరం జపించడం వల్ల ప్రజలు శివునితో ఐక్యంగా ఉన్నట్లు భావిస్తారు.

హర హర మహాదేవ్

చిన్నపిల్లవాడు కూడా పలకగలిగేంత ప్రసిద్ధమైన, సరళమైన అత్యంత పవిత్రమైన మంత్రం హర హర మహాదేవ్. జ్ఞానం, శాంతిని, నాశనం చేసే శివుని పాత్రను ఈ మంత్రం నిర్వచిస్తుంది. మహాదేవుడే అత్యున్నత గొప్ప స్వభావానికి చిహ్నంగా భావిస్తారు. ఈ మంత్రం జీవితంలో ఆశీర్వాదాలు, రక్షణ, ఆధ్యాత్మిక ఉద్ధరణను తీసుకువస్తుంది. అడ్డంకులను అధిగమించేందుకు మనసుని శుద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పరివర్తనం కోసం ఇది సహాయపడుతుంది. హర హర మహాదేవ్ అనేది విశ్వంలో సృష్టి సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు.

శివ ధ్యాన మంత్రం

కర్చరాంకృతం వా కైజం కర్మజం వా శ్రవణ్ణయాంజం వా మాంసం వా పరాధం

విహితం విహితం వా సర్వ్ మేతత్ క్షమస్వ జై జే కరుణాబ్ధే శ్రీ మహాదేవ్ శంభో

ఇది చాలా శక్తివంతమైన మంత్రం, జీవితకాలంలో మీరు చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ శివుడిని వేడుకోవడంలో సహాయపడుతుంది.

ఏక రుద్ర మంత్రం

ఏక రుద్ర మంత్రం పదకొండు వేర్వేరు మంత్రాల సమాహారం. మహా శివరాత్రి లేదా మహా రుద్ర యజ్ఞం సమయంలో ఈ పదకొండు మంత్రాలు పఠిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పదకొండు మంత్రాలు ఒక్కొక్కటి ఒక్కో నెలకు అనుగుణంగా ఉంటాయి. ఈ పదకొండు మంత్రాలు పఠించడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు.

కపాలి- ఓం హుమ్ హమ్ శత్రుస్తంభనాయ హుమ్ హుమ్ ఓం ఫట్

పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వ మంగళాయ పింగలాయ ఓం నమః

భీమా- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధాయ ఐం ఐం ఓం

విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రం ఓం నమః

విలోహిత- ఓం శ్రీం హరిం సం సం హ్రీం శ్రీం శంకరశానాయ ఓం

షష్ఠ- ఓం హ్రీం హ్రీం సాఫల్యాయై సిద్ధయే ఓం నమః

అజపద- ఓం శ్రీం బం సౌఫ్ బలవర్థనాయ బాలేశ్వరాయ రుద్రాయ ఫుట్ ఓం

అహిర్భూదన్య- ఓం హ్రాం హ్రీం హుమ్ సమస్త గ్రహ దోష వినాశాయ ఓం

శంభు- ఓం గం హ్లుమ్ శ్రౌమ్ గ్లౌమ్ గం ఓం నమః

చందా- ఓం చుం చాందీశ్వరాయ తేజస్యాయ చుమ్ ఓం ఫుట్

భవ- ఓం భావోద్ భవ సంభవాయ ఇష్ట దర్శన ఓం సం ఓం నమః

WhatsApp channel