ఈ ఐదు రాశుల వారు బాగా మొండి, ఒక్కసారి ఫిక్స్ అయితే వారి మాట వారే వినరు.. మీరూనా?-these 5 zodiac signs are stubborn and they will not listen to anyone once they decided see you are one among them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఐదు రాశుల వారు బాగా మొండి, ఒక్కసారి ఫిక్స్ అయితే వారి మాట వారే వినరు.. మీరూనా?

ఈ ఐదు రాశుల వారు బాగా మొండి, ఒక్కసారి ఫిక్స్ అయితే వారి మాట వారే వినరు.. మీరూనా?

Peddinti Sravya HT Telugu

కొన్ని రాశుల వారు బాగా మొండి వారు, కొన్ని రాశుల వారు ఎంతో కూల్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు. కొన్ని రాశుల వారు మాత్రం వారు ఒకసారి ఫిక్స్ అయితే వారి మాటను కూడా వారు వినరు. ఏ రాశుల వారు మొండిగా ఉంటారు, ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోరో చూద్దాం.

ఈ ఐదు రాశుల వారు బాగా మొండి (pinterest)

మొత్తం మనకి 12 రాశులు. రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందని చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు.

కొన్ని రాశుల వారు బాగా మొండి వారు, కొన్ని రాశుల వారు ఎంతో కూల్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు. కొన్ని రాశుల వారు మాత్రం వారు ఒకసారి ఫిక్స్ అయితే వారి మాటను కూడా వారు వినరు. నిజానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మొండితనం ఉంటుంది. "నేను ఎందుకు వారి మాట వినాలి" అని అనుకుంటూ ఉంటారు. అందరిలో మొండితనం ఉన్నా, కొంతమందిలో మాత్రం ఎక్కువగా ఉంటుంది.

ఒకసారి వారు ఏదైనా ఫిక్స్ అయినట్లయితే దానిని పూర్తి చేస్తారు తప్ప, ఎవరు చెప్పినా మధ్యలో వినరు. ఈ కారణంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడతారు. జ్యోతీష శాస్త్రం ప్రకారం ఏ రాశుల వారు మొండిగా ఉంటారు, ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోరో చూద్దాం.

1.మేష రాశి:

మేష రాశి వారు చాలా ధైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. కానీ ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే మళ్లీ వారిని వారు మార్చుకోవడానికి ఇష్టపడరు. వారు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా సరే, మళ్లీ మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఎవరు చెప్పినా వినిపించుకోరు. ఈ మొండితనం వలన కొన్నిసార్లు మేష రాశి వారు చిక్కుల్లో పడతారు.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు ఎమోషనల్. నిజానికి మృదువుగా కనిపిస్తారు, కానీ గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం వెనక్కి తగ్గరు. మొండితనం వీరికి చాలా ఎక్కువ. అలాగే ఎవరినైనా వారు ఒక్కసారి నమ్మితే వారిపై ఏ చెడు అభిప్రాయం కూడా రాదు. ఒకవేళ ఎవరి మీదైనా చెడు అభిప్రాయం ఏర్పడితే, ఏం మంచి చేయాలన్నా సరే వీరికి నచ్చదు.

3.వృషభ రాశి:

వృషభ రాశి వారు కూడా బాగా మొండిగా ఉంటారు. ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే, అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వారి మాటను కూడా వారు వినరు. ఇతరులు చెప్పేది విన్నట్టు నటిస్తారు, కానీ అసలు దానిని పట్టించుకోరు. ఈ కారణంగానే వారి స్నేహితులు, బంధువులు బాధపడతారు.

4.సింహ రాశి:

సింహ రాశి వారు కూడా మొండిగా వ్యవహరిస్తారు. సింహ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా వారి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే ఏ మాత్రం తట్టుకోలేరు. ఎప్పుడూ కూడా వారే కరెక్ట్ అని ఫీల్ అవుతారు. వారికి గౌరవం చాలా ముఖ్యం.

5.మకర రాశి:

మకర రాశి వారు క్రమశిక్షణతో ఉంటారు. ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. వారి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత దానిని వదిలిపెట్టరు. ప్రొఫెషనలిజం కారణంగా వారిలో ఆ మొండితనం వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.