2025 horoscope: కొత్త సంవత్సరం అద్భుతాలు చేయబోతున్న ఐదు గ్రహాలు- మూడు రాశుల వారికి ఆనందమే
2025 horoscope: కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది తమకు మంచి లాభాలు కలగాలని, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రానున్న ఏడాది తొలి నెల కీలక గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ఫలితంగా మూడు రాశుల వాళ్ళు లాభపడబోతున్నారు.
మరో రెండు నెలలో 2024 సంవత్సరం ముగియబోతుంది. అందరూ కొత్త సంవత్సరం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కష్టాలు ఇప్పటితోనే ముగిసిపోవాలని, కొత్త ఏడాది అయినా తమకు అదృష్టం పట్టాలని కోరుకుంటారు.
ఒక వ్యక్తి జాతకం మీద గ్రహాల స్థాన చలన మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్రహాలు రాశిని మార్చినప్పుడల్లా వాటి సానుకూల, ప్రతికూల ప్రభావాలు అన్ని రాశుల మీద కనిపిస్తుంది. నూతన సంవత్సరం తొలి నెల జనవరిలో కొన్ని ప్రధాన గ్రహాలు రాశులను మార్చుకుంటాయి. జనవరిలో బుధుడు, శుక్రుడు, కుజుడు, శని, సూర్యుడు తమ రాశిచక్రాలను మార్చుకుంటారు.
అన్నింటిలో మొదటిది గ్రహాల రాకుమారుడు బుధుడు జనవరి 4, 2025 న ధనుస్సు రాశిలోకి వెళ్తాడు. జనవరిలో శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాలలో శని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే రెండున్నర సంవత్సరాల తర్వాత శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు జనవరిలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. శని తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఈ మార్పు అనేక రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
ఈ సంవత్సరం అతిపెద్ద మార్పు శని గ్రహం. మీన రాశిలో శని గ్రహం రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. కీలకమైన ఈ గ్రహాల మార్పు కారణంగా ముఖ్యంగా మూడు రాశిచక్ర గుర్తులు ఈ మార్పుల నుండి ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. ఈ మార్పు వలన అన్ని రాశులవారు ప్రభావితమైనప్పటికీ ముఖ్యంగా మేషం, వృషభం, సింహ రాశి వారు ఎక్కువగా ప్రభావితమవుతారు.
మేషం
కొత్త సంవత్సరం మొదటి నెల మేష రాశి వారికి చాలా మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు సానుకూలంగా ఉంటాయి. మీకు చాలా మేలు చేస్తాయి. మీ చెడిపోయిన పని పూర్తవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. మొత్తం మీద అనేక ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆదాయం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు.
వృషభం
వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం మొదటి నెలలో శుభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. కొత్త సంవత్సరం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. డబ్బు, అదృష్టం రెండూ వీరికి అండగా నిలుస్తాయి. తీరని కోరికలు ఈ సమయంలో నెరవేరతాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే మీ పరిస్థితి డబ్బు పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొంత మార్పు ఉంటుంది. మీ పని పూర్తి అవుతుంది, మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మొత్తం మీద కొత్త సంవత్సరం మొత్తం మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.