ఈ 4 రాశుల వారు అబద్దాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు!-these 4 zodiac signs will easily finds lies without taking much time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ 4 రాశుల వారు అబద్దాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు!

ఈ 4 రాశుల వారు అబద్దాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు!

Peddinti Sravya HT Telugu

కొంతమంది నిజాయితీతో ఉంటే కొంతమంది అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. సొంత ప్రయోజనాల కోసమైనా కొంతమంది అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు అబద్ధాలు చెప్పిన వారిని ఇట్టే కనిపెట్టేస్తారు. ఇందులో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ 4 రాశుల వారు అబద్దాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు (pinterest)

రాశుల ఆధారంగా మనం చాలా విషయాలని చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు చెప్పడంతో పాటుగా వారి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయనేది కూడా అంచనా వేయచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు అబద్ధాలు చెప్పే వారిని ఇట్టే కనిపెట్టేస్తారు. మరి ఇందులో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

ఒక్కొక్కరి ప్రవర్తన, తీరు ఒక్కోలా ఉంటాయి. కొంతమంది నిజాయితీతో ఉంటే కొంతమంది అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. సొంత ప్రయోజనాల కోసమైనా కొంతమంది అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు అబద్ధాలు చెప్పిన వారిని ఇట్టే కనిపెట్టేస్తారు. ఇందులో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ 4 రాశుల వారు అబద్దాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా తెలివైన వారు. కర్కాటక రాశి వారు ఎవరైనా అబద్దం చెప్తే వెంటనే కనిపెట్టేస్తారు. వారి మాటలులో వచ్చే మార్పును బట్టి అబద్ధం చెబుతున్నారని సులువుగా కనిపెట్టేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా అబద్ధం చెప్తే వారు చెప్పేది పూర్తిగా వింటారు. ఆ తర్వాత వారు ఎంత లోతు దాకా అబద్ధాలు చెప్తున్నారనేది తెలుసుకుంటారు.

2.కన్యా రాశి

కన్యా రాశి వారు కూడా అబద్దాలని ఇట్టే కనిపెట్టగలరు. కన్యా రాశి వారికి ఏమైనా చెప్తే వారు సులువుగా అది అబద్ధం అని చెప్పేస్తారు. ఎవరైనా కథలు చెప్తే వీరు దగ్గర అవి ఏ మాత్రం సాగవు. మాట తీరు, ఐ కాంటాక్ట్ ని బట్టి అబద్ధాలు చెబుతున్నారని ఇట్టే గ్రహిస్తారు.

3.మిధున రాశి

మిధున రాశి వారు చాలా తెలివైన వారు. ఈ రాశి వారు ఎవరైనా మాట్లాడేటప్పుడు అది అబద్దం అయితే వారికి సులువుగా తెలిసిపోతుంది. అది అబద్ధమని తెలిసినా, మళ్లీ మళ్లీ అడిగి వారు అబద్దాలు చెప్తున్నారని ప్రూవ్ చేయగలరు.

4.మకర రాశి

మకర రాశి వారు అబద్ధాలు చెప్పే వారిని సులువుగా పసిగడతారు. పైగా ఈ రాశి వారి దేనికి భయపడరు. పైగా ఇలాంటి కథలకు వారి దగ్గర సమయం ఉండదు. వీళ్ళు ఎంతో బాధ్యతగా ఉంటారు. అబద్ధాలు చెప్పినా, కథలు చెప్పినా వీరి దగ్గర అసలు నడవవు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం