ఈ ఏడాది 3 రాశులకు రెండు సార్లు దీపావళి.. రాహువు నుంచి వాహనాలు, ఆస్తులు, డబ్బు, శుభవార్తలు ఇలా అనేకం!-these 3 rasis will receive lands vehicles immense wealth and many more after diwali 2025 due to rahu check it now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఏడాది 3 రాశులకు రెండు సార్లు దీపావళి.. రాహువు నుంచి వాహనాలు, ఆస్తులు, డబ్బు, శుభవార్తలు ఇలా అనేకం!

ఈ ఏడాది 3 రాశులకు రెండు సార్లు దీపావళి.. రాహువు నుంచి వాహనాలు, ఆస్తులు, డబ్బు, శుభవార్తలు ఇలా అనేకం!

Peddinti Sravya HT Telugu

ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. రాహువు ఈ నక్షత్రానికి అధిపతి. సొంత నక్షత్రంలోకి రాహువు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

ఈ 3 రాశులకు ఈ ఏడాది రెండు సార్లు దీపావళి (pinterest)

గ్రహాలు ఎప్పటికప్పుడు శుభ యోగాలను తీసుకొస్తూ ఉంటాయి. కాలానుగుణంగా గ్రహాలు మార్పు చెందడంతో ఫలితం ద్వాదశ రాశులపై పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే రాహువుని నీడగ్రహం అని అంటారు. రాహువు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా నక్షత్రాలని కూడా మారుస్తాడు. దీపావళి తర్వాత రాహువు నక్షత్రం మార్పు చేస్తాడు. రాహువు నక్షత్ర సంచారం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

దీపావళి తర్వాత రాహు సంచారంలో మార్పు

ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు శతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు. రాహువు ఈ నక్షత్రానికి అధిపతి. సొంత నక్షత్రంలోకి రాహువు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

శతభిష నక్షత్రంలోకి రాహువు.. ఈ రాశుల వారికి అన్నీ శుభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలను తీసుకురానుంది. ఈ రాశి వారు సక్సెస్‌ని అందుకుంటారు. ఎక్కువ లాభాలను పొందుతారు. అన్ని పనుల్లో కూడా మేష రాశి వారు ఉత్సాహంగా పాల్గొంటారు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఉద్యోగులకు, వ్యాపారులకు ఇది చక్కటి సమయం. ఆర్థికంగా బావుంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. పాత వివాదాలన్నీ తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది.

2.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ రాశి వారి జీవితంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. సంపద పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

కుటుంబ సభ్యులందరి మద్దతు ఉంటుంది. రాహువు అనుగ్రహం వలన ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలని అందిస్తుంది. ఈ రాశి వారు శుభఫలితాలను అందుకుంటారు. శుభవార్తలు వింటారు. కెరీర్‌లో బావుంటుంది. ఈ రాశి వారికి గౌరవం, కీర్తి లభిస్తాయి.

రాహువు అనుగ్రహంతో ఈ రాశి వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. విజయాలను అందుకుంటారు. వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఆస్తి కూడా మీ చేతికి వస్తుంది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.