రెండు రోజుల వ్యవధిలో శని, సూర్యుల సంచారం.. ఈ రాశుల వారికి సానుకూలం-the transit of satunr and sun planets in a period of two days is positive for these 4 moon signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  The Transit Of Satunr And Sun Planets In A Period Of Two Days Is Positive For These 4 Moon Signs

రెండు రోజుల వ్యవధిలో శని, సూర్యుల సంచారం.. ఈ రాశుల వారికి సానుకూలం

HT Telugu Desk HT Telugu
Jun 05, 2023 10:07 AM IST

రెండు రోజుల వ్యవధిలో శని, సూర్యుల సంచారం కారణంగా ఈ 4 రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.

శని, సూర్య గ్రహాల సంచార ఫలితాలు
శని, సూర్య గ్రహాల సంచార ఫలితాలు

వైదిక జ్యోతిష శాస్త్రంలో శని గ్రహ సంచారం ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఇప్పుడు శని దేవుడు ఐదు నెలల పాటు తిరోగమనంలో పయనించబోతున్నాడు. అంతకు రెండు రోజుల ముందు సూర్య గ్రహ సంచారం ఉండబోతోంది. ఈ రెండు పరిణామాల వల్ల ఏయే రాశులు ప్రయోజనం పొందుతాయో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

జూన్ 15న ఉదయం 11.58 గంటలకు సూర్యుడు మిథున రాశిలోకి పయనిస్తాడు. జూన్ 17న రాత్రి 10.48 గంటలకు శని కుంభ రాశిలో తిరోగమనంలో పయనిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని, సూర్యుల ఈ కదలికల వల్ల 4 రాశుల వారికి శుభ ఘడియలు ఆసన్నమవుతాయి.

మిథున రాశి జాతకులపై

శని, సూర్యుల సంచార ప్రభావం వల్ల మిథున రాశి జాతకులకు శుభ ఫలితాలు అందుతాయి. అనేక అంశాలలో విజయావకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ఇది మీ పిల్లలకు శుభ సమయంగా మారుతుంది.

సింహ రాశి జాతకులపై

సూర్యుడు, శని గ్రహాల సంచారం సింహ రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారం, వృత్తిలోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయడానికి అదృష్ట బలం తోడుంటుంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇదే సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది.

కన్యారాశిపై

సూర్యుడు, శని సంచారం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కన్యారాశిలో సూర్యుడు పదో ఇంట్లోకి వసాడు. శని ఆరో ఇంట్లో తిరోగమనం చెందుతాడు. వ్యాపారస్తులు లాభదాయక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడానికి ఇది మంచి సమయం. జీవితంలో విజయవంతంగా ముందుకు సాగడానికి ఇది మీకు సహాయపడుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడుతాయి.

మకర రాశిపై

సూర్యుడు మకర రాశి ఆరో ఇంట్లో సంచరిస్తాడు. మకర రాశి జాతకులు ఈకారణంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. వారి భవితవ్యం సానుకూలంగా మారుతుంది. రాశి చక్రంలో శని కూడా తిరోగమనంలో ఉంటాడు. ఇది సానుకూల ఫలితాలు అందిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితాన్ని కాపాడుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

WhatsApp channel