ఆదివారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?-the significance of the sun day know what to do on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  The Significance Of The Sun Day Know What To Do On This Day

ఆదివారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 04:05 AM IST

ఆదివారం రోజుకు ఉన్న విశిష్టత ఏంటి? ఈరోజు ఏం చేయాలి? పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

ఆదివారం సూర్యుడిని ప్రార్థించాలని సూచన
ఆదివారం సూర్యుడిని ప్రార్థించాలని సూచన

మన సనాతన ధర్మంలో ప్రతీరోజుకు ఒక విశేషము ప్రాధాన్యత ఉన్నది. ఆ ప్రాధాన్యత ప్రకారము ఆ యొక్క దేవీ దేవతల పూజ ఉపాసన, ఆరాధనలు వంటివి ఆచరించడం సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే ఐదు అంగములు. వీటిలో వారమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. వారములో మొదటిరోజు ఆదివారము.

ఆదివారం ఏ వ్యక్తియైనా ఆచరించవలసిన నియమములను చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆదివారం సూర్యారాధన చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది.

ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించినటువంటి వారికి నవగ్రహాలకు అధిపతియైనటువంటి సూర్యుని ప్రభావంచేత గ్రహ దోషాలన్నీ తొలగుతాయి. ప్రతీ రాశివారు ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

WhatsApp channel

టాపిక్