Telugu Panchangam: రేపటి పంచాంగం 8 మార్చి 2024 శుక్రవారం
Pachangam in telugu: రేపటి పంచాంగం తేదీ 8 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

తేదీ 8 మార్చి 2024వ తేదీ శుక్రవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.
హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
విక్రమ సంవత్సరం 2080
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి, రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు,
వారం: శుక్ర వారం
నక్షత్రం: శ్రవణా నక్షత్రం ఉదయం 8.35 గంటల వరకు,
యోగం: శివం రాత్రి 11.42 గంటలు
కరణం: గరజి ఉదయం 9.14 వరకు, వణి రాత్రి 8.12 వరకు
అమృత కాలం: రాత్రి 9 గంటల 21 నుంచి 10.51 వరకు
వర్జ్యం: పగలు 12.20 నుంచి ఒంటి గంట 50 నిమిషాల వరకు
దుర్ముహుర్తం: ఉదయం దుర్ముహూర్తం 8.50 నుంచి 9 గంటల 38 నిమిషాల వరకు, పగలు దుర్ముహూర్తం 12 గంటల 47 నిమిషాల నుంచి ఒంటి గంటా 34 నిమిషాల వరకు
రాహు కాలం: ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు
నేటి పర్వదినాలు: మహా శివరాత్రి, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి నంది వాహనోత్సవం, శ్రీనివాస మంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ అవభృథం, చక్రస్నానం, ధ్వజారోహణం. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం ప్రారంభం.
పంచాంగం సమాప్తం.
(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)