Telugu Panchangam: రేపటి పంచాంగం తేదీ 20 మార్చి 2024 బుధవారం-telugu panchangam on 20th march 2024 wednesday sarva ekadashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Telugu Panchangam: రేపటి పంచాంగం తేదీ 20 మార్చి 2024 బుధవారం

Telugu Panchangam: రేపటి పంచాంగం తేదీ 20 మార్చి 2024 బుధవారం

HT Telugu Desk HT Telugu

Telugu Panchangam: తెలుగు పంచాంగం తేదీ 20 మార్చి 2024 కోసం ఇక్కడ తెలుసుకోండి. అమృత ఘడియలు, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవండి.

గణనాథుడి ఆశీస్సులు లభించుగాక

తేదీ 20 మార్చి 2024వ తేదీ బుధవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చదవొచ్చు. హిందూ పంచాంగం ప్రకారం నేటి తిథి ఇక్కడ తెలుసుకోండి.

హిందూ తెలుగు పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

విక్రమ సంవత్సరం 2080

మాసం (నెల): ఫాల్గుణ మాసం

పక్షం: శుక్ల పక్షం

తిథి: ఏకాదశి, తెల్లవారుజాము 4 గంటల 07 నిమిషాల వరకు (తెల్లవారితే గురువారం)

వారం: బుధవారం

నక్షత్రం: పుష్యమి నక్షత్రం రాత్రి 12 గంటల 31 నిమిషాల వరకు,

యోగం: అతి రాత్రి 7.04 వరకు,

కరణం: వణి పగలు 3.35 వరకు, భద్ర తెల్లవారుజామున 4.07 వరకు

అమృత కాలం: సాయంత్రం 5.41 నుంచి 7.23 వరకు

వర్జ్యం: ఉదయం 7.27 నుంచి 9.09 వరకు

దుర్ముహుర్తం: పగలు: 11.56 నుంచి 12.44 వరకు,

రాహుకాలం: మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు

యమగండం: ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు

ఈరోజు సర్వ ఏకాదశి, తిరుమల శ్రీవారి తెప్పోత్సవారంభం.

పంచాంగం సమాప్తం.

(ఆధారం: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం)