Telugu hanuman jayanti 2024: రేపే తెలుగు వారి హనుమాన్ జయంతి..ఇలా చేశారంటే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయ్
Telugu hanuman jayanti 2024: చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు వైశాఖ మాసం దశమి తిథి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అలా జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి వచ్చింది.
Telugu hanuman jayanti 2024: హనుమాన్ జయంతి పండుగణు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు శని జూన్ 1వ తేదీన జరుపుకొనున్నారు. చైత్ర పూర్ణిమ నుంచి ప్రారంభమయ్యే 41 రోజుల ఆధ్యాత్మిక దీక్షను భక్తులు పాటిస్తారు. ఈ కాలాన్ని హనుమాన్ దీక్ష అంటారు. ఈ సమయంలో భక్తులు కాళ్ళకు చెప్పులు కూడా ధరించకుండా నియమాలు ఆచరిస్తారు.
హనుమాన్ జయంతి తిథి
శక్తివంతమైన హనుమాన్ మంత్రాలను పఠిస్తూ ఆధ్యాత్మిక సంకేతాలు అనుసరిస్తారు. 41 రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలోని దశమి తిథిలో హనుమాన్ జయంతి ప్రాముఖ్యత చాలా ప్రతీకాత్మకమైనది. జూన్ 1వ తేదీ ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణిస్తారు.
హనుమాన్ జయంతి 2024 సమయంలో గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాల స్థానం వృత్తిపరమైన పురోగతికి, అడ్డంకులను అధిగమించడానికి, స్థిరమైన శ్రేయస్సును పొందేందుకు హనుమంతుని నుండి వరాలను పొందేందుకు అత్యంత శుభప్రదమని నమ్ముతారు. 41 రోజుల దీక్షకు నాంది పలికే పూర్ణిమ తిథి లేదా చైత్ర పూర్ణిమ నాడు పౌర్ణమి సమయంలో సూర్యచంద్రుల కలయిక అత్యంత పవిత్రమైనది. ఇది దైవిక శక్తుల ఆశీర్వాదాల ద్వారా మనస్సు, శరీరం, ఆత్మ ఆధ్యాత్మిక ప్రక్షాళనను సూచిస్తుంది. దీక్ష విరమించే 41వ రోజు తెలుగు ప్రజలు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.
మంచి ఉద్యోగం కోసం
హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులు కోరడం కెరీర్, ఆర్థిక విజయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి హనుమాన్ చాలీసా పఠించడం కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయడం అడ్డంకులను తొలగించి కొత్త మార్గాలను తెరవడంలో సహాయపడుతుంది. ఎలాంటి అవాంతరాలనైనా ఎదుర్కొని అధిగమించే శక్తి, పరాక్రమం, ధృఢత్వం కోసం హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించాలి.
అప్పుల నుంచి బయటపడేందుకు
వ్యాపారంలో విజయం కోసం, అప్పుల నుండి ఉపశమనం పొందడం కోసం, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపదను పొందడం కోసం ఎర్రటి సిందూరం ఆంజనేయుడికి సమర్పించాలి. హనుమాన్ బీజ మంత్రం 'రామ్ రామ్ రామ్' పఠించడం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. పెళ్లికాని వారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి హనుమాన్ జీకి సుందర కాండ పారాయణం చేసి స్వామికి సింధూరం సమర్పించాలి. ఇలా చేస్తే కోరుకున్న త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి.
సంతానం కోసం
సంతానం లేని దంపతులు హనుమంతుడిని పూజించి అరటిపండ్లను కోతులకు తినిపించాలి. అలాగే బజరంగ్ బాన్ పఠించాలి. ఇలా చేస్తే సంతానలేమి సమస్యను అధిగమించి ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శక్తివంతమైన హనుమాన్ మంత్రాలను పఠించడం శక్తివంతమైన వానరాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రభావవంతమైన మార్గం అని నమ్ముతారు.
వాయువ్య దిశలో హనుమంతుడి విగ్రహం ఉంచి పూజించడం మంచిది. దీనిని వాయు కోన అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దిశ హనుమంతుని ఆధీనంలో ఉంటుంది. సానుకూల శక్తులను ఆకర్షించడానికి, ప్రతికూల శక్తులను దూరం చేయడానికి, ఆరోగ్యం, శ్రేయస్సును అందించేందుకు సహాయపడుతుంది.
దానం ముఖ్యమే
పండుగతో సందర్భం లేకుండా ఎప్పుడైనా దానం చేయడం ముఖ్యమైనదే. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా దానం చేయవచ్చు. పేదలకు, అవసరంలో ఉన్న వారికి, దేవాలయాలకు ఆహారం, వస్త్రాలు, డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. ఎరుపు రంగు దుస్తులు, సింధూరం, అరటి పండ్లు వంటివి దానం చేస్తే హనుమంతుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఈ చర్యలు శరీరం, ఆత్మను శుద్ధి చేస్తాయి. హనుమంతుడి ఆశీర్వాదం పొండటంలో సహాయపడతాయి.