Sun Transit: ధనస్సు రాశిలోకి సూర్యుడి సంచారం.. వారం దాటిందంటే ఈ రాశుల వారికి అదృష్టం
సూర్య భగవానుడు డిసెంబర్ 15న రాశిచక్రాన్ని మార్చుకోబోతున్నాడు. వృశ్చికం నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు కారణంగా రాబోయే కాలం ఈ రాశుల వారికి వరంగా మారనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాలలో సూర్యుడు ఒకటి. సూర్యదేవునికి అన్ని రాశుల్లో కల్లా ప్రత్యేక స్థానం ఉంది. సూర్యదేవుడిని సకల గ్రహాలకు రాజు అని, గ్రహాల అధిపతిగా పిలుస్తుంటారు. శక్తి, తేజస్సు, వృత్తి, ఆర్థికం, విజయం వంటి విషయాలకు కారుకుడి సూర్యుడు. జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం సూర్యభగవానుడు నెలకు ఒకసారి తన రాశిచక్రాన్ని మారుస్తాడు. డిసెంబర్ 15న సూర్యడు తన రాశిచక్రాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం ధనస్సు రాశిలో సంచరిస్తున్న సూర్య గ్రహం డిసెంబర్ 15న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుస్సు బృహస్పతికి అంటే గురు గ్రహానికి చెందిన రాశి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో, ఇది కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. సూర్యభగవానుడు, బృహస్పతిల కలియిక సమయంలో కొందరికి శుభ ప ప్రయోజనాలు కలుగుతాయి. ధనుస్సు రాశిలో సూర్యుని ప్రవేశం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
మేష రాశి :
మేష రాశి వారికి సూర్య గ్రహ సంచారంలో మార్పు చాలా శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు విస్తరణ పనులు చేపడతారు. ఈ కాలంలో మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. అనుకూలించే కాలం కావడంతో మంచి పెట్టుబడులు, వాటికి తగిన లాభాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్థులు శుభవార్తలు వింటారు. పదోన్నతితో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సమయం మీకు అన్ని విధాలా విజయాన్నే చేకూరుస్తుంది.
సింహ రాశి :
ధనస్సు రాశిలో సూర్యుని సంచారం మిథున రాశి వారికి శుభదాయకం కానుంది. మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు వారి ఊహించని లాభాలు పొందుతారు. పెట్టుబడులకు మించి లాభాలు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంలో సఫలీకృతమవుతారు. ఉద్యోగంలో పైఅధికారుల ప్రశంసలు పొందుతారు.
కన్య రాశి :
సూర్య భగవానుడి ధనస్సు సంచార సమయం కన్యారాశి వారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. సూర్య భగవానుని అనుగ్రహంతో కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీకు అన్నింటా అదృష్టం కలిసివస్తుంది. నూతన ప్రయత్నాలు శుభఫలితాలను ఇస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ పై ప్రభావం చూపిస్తాయి.
ధనుస్సు రాశి :
సూర్య భగవానుడు మీ రాశిలోకి మారుతుండటం మీకు రాశికి అనుకూల సమయం కానుంది. శుభవార్తలు అందుకుంటారు. ఈ కాలంలో మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. సూర్యదేవుని అనుగ్రహంతో కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో కూడా సంతృప్తి లభిస్తుంది.