Raja bhang yogam: రాజభంగ యోగం, రానున్న నాలుగు రోజులు ఈ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి
Raja bhang yogam: ప్రస్తుతం సింహరాశిలో శుక్రుడు, సూర్యుడు కలయిక వల్ల రాజభంగ యోగం ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక శుభప్రదంగా పరిగణించబడదు. దీని కారణంగా ఆగస్టు 25 వరకు కొన్ని రాశులలో ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది.
Raja bhang yogam: ప్రస్తుతం సూర్యుడు, శుక్రుడు ఒకే రాశిలో కూర్చున్నారు. ఆగస్ట్ 16 నుంచి గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. ఇప్పటికే సింహ రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు సంచరించిన వెంటనే శుక్రుడితో కలయిక ఏర్పడింది. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి సమయం బాగానే ఉంటుంది కానీ మరికొందరు జాగ్రత్తగా ఉండాలి.
సూర్యుడు, శుక్రుడి కలయికతో రాజభంగ యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక తదుపరి 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్ట్ 25న శుక్రుడు తన రాశి మారిన వెంటనే ఈ సంయోగం ముగుస్తుంది. శుక్రుడు ఆగస్ట్ 25 నుంచి కన్యా రాశిలో సంచరిస్తాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శుక్రుడు మధ్య శత్రుత్వ సంబంధం ఉన్నట్లు పరిగణిస్తారు. దీనితో పాటు సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగాన్ని కూడా ఏర్పరిచారు. అటువంటి పరిస్థితిలో శుక్రుడు, సూర్యుని కలయిక వల్ల ఏర్పడిన రాజభంగ యోగం కొంతమందికి టెన్షన్‌ను పెంచవచ్చు. సింహ రాశిలో శుక్రుడు, సూర్యుడు కలవడం వల్ల రాబోయే 4 రోజుల పాటు ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేష రాశి
సింహ రాశిలో సూర్య-శుక్రుల కలయిక మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉండదు. ఆర్థిక పరిస్థితిలో మార్పు రావచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పరిస్థితులు ప్రతికూలంగా అనిపించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. మీ భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మాటలు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే పరిస్థితులు చేయి దాటే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సింహ రాశిలో శుక్రుడు, సూర్యుని కలయిక మీకు శుభప్రదంగా ఉండకపోవచ్చు. ఆర్థిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. మీరు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. రానున్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండటం మంచిది.
తులా రాశి
శుక్రుడు, సూర్యుని కలయిక వల్ల ఏర్పడిన రాజభంగ యోగం తులా రాశి వారికి అశుభ ఫలితాలు ఇస్తుంది. మీ కెరీర్‌లో సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఆఫీసులో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మితిమీరిన ఖర్చు మనస్సును కలవరపెడుతుంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆగస్ట్ 25 వరకు కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంటుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.