Raja bhang yogam: రాజభంగ యోగం.. రేపటి నుంచి వీరికి కష్టాలు మొదలుకాబోతున్నాయి, జాగ్రత్త
Raja bhang yogam: సూర్యుడు, శుక్రుడు కలిసి రాజభంగ యోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి కొద్ది రోజుల పాటు కష్టాలు ఉండబోతున్నాయి. ఏయే రాశుల వాళ్ళు ఈ యోగం వల్ల ప్రభావితం అవుతారో చూద్దాం.
Raja bhang yogam: గ్రహాల రాజు సూర్యుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెల రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. ఇదే రాశిలోకి శుభాలను ఇచ్చే శుక్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు.

మే 19 నుంచి శుక్రుడు వృషభ రాశి సంచారం చేస్తాడు. ఇది మేషం నుంచి మీన రాశి వరకు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. వృషభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి రాజభంగ యోగాన్ని సృష్టిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శుక్రుడు శత్రు గ్రహాలు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడిన ఈ యోగం ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల రానున్న 24 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి.
రెండు యోగాలు
సూర్యుడు, శుక్రుడు ఓకే రాశిలో కలిసినప్పుడు ఈ రాజభంగ యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు ఇవి రెండు కలిసి శుక్రాదిత్య యోగాన్ని కూడా ఇవ్వనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు శక్తివంతమైన శుభకరమైన యోగాన్ని సృష్టిస్తాయి. కొన్ని రాశుల వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని వల్ల అత్యంత అనుకూలమైన ప్రభావాలు ఎదుర్కొంటారు.
శుక్రుడు అందం, ప్రేమ, శ్రేయస్సు, భౌతిక సౌకర్యాల గ్రహంగా పరిగణిస్తారు. ఆనందం, విలాసాలు, సంబంధాలు, కళాత్మక ప్రతిభ మరియు సామాజిక సామరస్యాన్ని నియంత్రిస్తుంది. స్వీయ వ్యక్తీకరణ, వ్యక్తిత్వం, విశ్వాసం, నాయకత్వం వంటి వాటికి సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రెండు ప్రభావవంతమైన గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగం కొందరికి ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. శుక్రుడు, సూర్యుడి వల్ల వచ్చే రాజభంగ యోగం వల్ల ఏ రాశుల వారికి కష్టాలు పెరుగుతాయో తెలుసుకుందాం.
మేష రాశి
సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల మేష రాశి వారి జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. శత్రువులు చాలా చురుగ్గా మీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల అలజడి రేగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అహంకారం వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కార్యాలయంలో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి జీవితంలో రాజభంగ యోగం అనేక ఒడిదుడుకులు తీసుకొస్తుంది. కష్టపడి పని చేసిన మంచి ఫలితాలు రావు. కార్యాలయంలో పనులకు అదనపు బాధ్యతలు వస్తాయి. మానసిక అలజడి ఏర్పడుతుంది. కార్యాలయంలో వివాదాలు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు మదిలో మెదులుతాయి. ధన సంబంధ సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి.
తులా రాశి
శుక్రుడు, సూర్యుడి కలయిక కారణంగా ఏర్పడే రాజభంగ యోగం తులా రాశి వారికి ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. రానున్న 24 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సవాలుతో కూడిన పరిస్థితులు ఏర్పడతాయి. సంబంధాల్లో విభేదాలు పెరుగుతాయి. ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే నష్టం సంభవించవచ్చు.