Sun transit: సూర్యుడు నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశితో పాటు నక్షత్రాన్ని మార్చుకుంటాయి. ఈ మార్పులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక జూలై 14 నుంచి సూర్య భగవానుడు పుష్య నక్షత్రంలో సంచరిస్తున్నాడు.
పుష్య నక్షత్రాన్ని తిష్య, అమ్రేజ్య నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఇది జ్యోతిషశాస్త్ర పదం. తిష్య అనేది శుభప్రదమైన రాశిని సూచిస్తుంది. అయితే అమ్రేజ్య అనేది దేవతలు గౌరవించే నక్షత్ర రాశిని సూచిస్తుంది. పుష్య నక్షత్రానికి శని అధిపతి. ఆగస్ట్ 2 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. అనంతరం ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
శని నక్షత్రంలో సూర్యుడి సంచారం కొన్ని రాశులకు ఇతరుల కన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారి అదృష్టం మారుతుందో తెలుసుకుందాం.
సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడంతో కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది మాత్రమే కాకుండా కర్కాటక రాశిలోనే సూర్యుడి సంచారం జరుగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఈ రాశి వారికి అధిక లాభాలు ఉంటాయి. గౌరవం, కీర్తి వంటి సామాజిక స్థితి మెరుగుపడుతుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. ఏదైనా కార్యం తలపెడితే అన్నీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వివాహితుల జీవితాలు ప్రేమతో నిండిపోతాయి. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
సూర్యుడి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా లాభాలు చేకూరతాయి. పదోన్న,తి వేతన పెంపు వంటి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. భవిష్యత్తులో మీకు సహాయం చేయగలిగే కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఇంట్లోకి కుటుంబంలో ఆనందం, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆశించిన విధంగా పురోగతిని సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
సూర్యుడు వృశ్చిక రాశి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. నక్షత్రం మార్పు వల్ల ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని గతంలో ఆగిపోయినట్లయితే అది ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. సవాళ్లను అధిగమించగలుగుతారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. విదేశాలకు ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుంది. డబ్బు ఆదా చేయడంలో మంచి అవకాశాలు లభిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.