Gochara phalalu: వృశ్చిక రాశిలో సూర్యుడు ప్రవేశం- 12 రాశుల గోచార ఫలాలు ఇవే
Gochara phalalu: నవంబరు 16న గ్రహాల అధిపతి సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. సూర్యుడు రాశి మారడం పలు రాశులకు వేరే వేరు ఫలితాలనిస్తుంది.
నవంబరు 16న గ్రహాల అధిపతి సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. సూర్యుడు రాశి మారడం పలు రాశులకు వేరే వేరు ఫలితాలనిస్తుందని అని ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం మీ జీవితం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, మరియు సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
1. మేష రాశి (Aries)
రవి అష్టమ స్థితి అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశముంది. శాంతి కోసం దైవారాధన చేయడం మంచిది అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
2. వృషభ రాశి (Taurus)
రవి ఏడవ స్థానంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కొంత టెన్షన్ ఉండొచ్చు. భాగస్వామి నుంచి విరోధ భావన ఉంటే సర్దుబాటు చేసుకోండి. వ్యాపారాలకు ఆటంకాలు ఉండవచ్చు. శుభ కార్యాలు ఆలస్యం అవుతాయి అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
3. మిథున రాశి (Gemini)
రవి ఆరో స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తుంది. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత మేరకు మెరుగ్గా ఉంటాయి.
4. కర్కాటక రాశి (Cancer)
రవి ఐదవ స్థానంలో ఉండడం వల్ల మీకు బుద్ధి వికాసం కలుగుతుంది. పిల్లల విద్యలో మంచి ఫలితాలు వస్తాయి. పనుల్లో రాణించేందుకు ఇది మంచికాలం. శుభ కార్యాలు జరుగుతాయి.
5. సింహ రాశి (Leo)
రవి నాల్గవ స్థానంలో అనుకూలత తక్కువ. కుటుంబంలో అశాంతి ఉండవచ్చు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా ఉండవు అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
6. కన్య రాశి (Virgo)
రవి మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వగలదు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పనిలో మెరుగుదల ఉంటుంది. చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
7. తుల రాశి (Libra)
రవి రెండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు కలగవచ్చు. కుటుంబసంబంధ సమస్యలు తీర్చుకోవాల్సి ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో సమస్యలు పరిష్కరించండి.
8. వృశ్చిక రాశి (Scorpio)
రవి మీ స్వరాశిలో ఉన్నందున స్వభావంలో కొన్ని మార్పులు వస్తాయి. మీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, కొత్త అవకాశాలు కూడా చర్చకు వస్తాయి.
9. ధనుస్సు రాశి (Sagittarius)
రవి ద్వాదశ స్థితి గోచారంగా లేదు. ఖర్చులు అధికం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. దైవారాధన చేయడం మంచిది.
10. మకర రాశి (Capricorn)
రవి పదకొండవ స్థానం ఉండటం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. మిత్రుల నుంచి సహకారం ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది.
11. కుంభ రాశి (Aquarius)
రవి దశమ స్థితి వల్ల వృత్తిలో పురోగతి ఉంటుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
12. మీన రాశి (Pisces)
రవి నవమ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం అనుకూలిస్తుంది. ధార్మిక కార్యాల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అని పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.