Sun Transit: డిసెంబర్ 15న సూర్యుడి సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి తిప్పలు తప్పవు!-sun transit into sagittarius brings more difficulties to these zodiac sings in december ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: డిసెంబర్ 15న సూర్యుడి సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి తిప్పలు తప్పవు!

Sun Transit: డిసెంబర్ 15న సూర్యుడి సంచారంలో మార్పు.. ఈ రాశుల వారికి తిప్పలు తప్పవు!

Ramya Sri Marka HT Telugu
Dec 06, 2024 06:20 PM IST

Sun Transit: గ్రహాల అధిపతి సూర్యుడు నెలకొక సారి తన రాశి చక్రాన్ని మారుస్తాడు. సూర్యుడి సంచారంలో మార్పు ప్రతి సారి రాశి చక్ర గుర్తులపై ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 15న సూర్యభగవానుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి తిప్పలు తెచ్చిపెడుతుంది.

సూర్యుడి సంచారంలో మార్పు
సూర్యుడి సంచారంలో మార్పు

గ్రహాల అధిపతి సూర్యుడు తన రాశి చక్రాన్ని నెలకు ఒకసారి మారుస్తాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్య గ్రహం త్వరలో తన రాశి చక్రాన్ని మార్చుకోనున్నాడు. డిసెంబర్ 15న సూర్యభగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శక్తి, తేజస్సు, వృత్తి, ఆర్థిక విషయాల కారకుడు సూర్యుడు. సూర్య గ్రహ సంచారంలో మార్పు రాశి చక్రాల గుర్తులపై తప్పకుండా పడుతుంది. ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారిని బాగా ఇబ్బంది పెట్టనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం రండి..

yearly horoscope entry point

వృషభం -

ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వృషభ రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అనుకోని ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ బంధువులతో విభేదాలు ఉండవచ్చు. మీ గౌరవం, మర్యాద తగ్గే అవకాశం కూడా ఉంది. మాటతీరులోని కఠినతను నియంత్రించడం ద్వారా వివాదాలు ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. తెలివిగా వ్యాపారం చేసే వారికి కాస్త ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

కర్కాటకం:

సూర్యుడి ధనస్సు రాశి సంచారం కర్కాటక రాశి వారు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ కలహాలు కూడా ఇబ్బంది పెడతాయి.పెద్దల సలహాతో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కన్యా :

ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కన్యా రాశి వారికి కలిసొచ్చేలా లేదు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉదర సంబంధ సమస్యలు తరచూ వేధిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. శాంతి, పనిలో విజయం కోసం దుర్గామాతను ఆరాధించండి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు.

మకరం:

సూర్యుడి రాశి చక్రంలో మార్పు మకర రాశి వారికి ఒత్తిడితో కూడిన సమయాన్ని తెచ్చిపెట్టనుంది. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారంలో నష్టాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఎవరితోనైనా వివాదాలకు దూరంగా ఉండండి. మీ సీనియర్లు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా ప్రారంభించిన పనిలో విజయాన్ని సాధించవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. గృహ సమస్యలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది.

కుంభం:

ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం కుంభ రాశి వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీకు ఏకాగ్రత లోపిస్తుంది. కపటవాదుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రక్త సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చట్టపరమైన విచారణ ద్వారా మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయవచ్చు. అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమయంలో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner