Sun transit: మిథున రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి వ్యాపారంలో వృద్ధి, గౌరవం పెరుగుతుంది
Sun transit: గ్రహాల రాజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో జూన్ 15 నుంచి ఈ రాశుల జీవితం మారిపోతుంది. తమ మాటలు, తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు.

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నెలకొకసారి తన రాశిని మార్చుకుంటూ అనేక రాశులను ప్రభావితం చేస్తాడు. జూన్ లో సూర్యుడు మిథున రాశి ప్రవేశం చేయబోతున్నాడు.
మిథున రాశికి బుధుడు పాలక గ్రహం. నవగ్రహాలలో సూర్యుడు, బుధుడు రెండు స్నేహపూర్వక గ్రహాలు. జులై 15 వరకు సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తాడు.
సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. సూర్యుడి ప్రభావం కలిగిన రాశులు మేధోపరమైన ఆసక్తి కలిగి ఉంటారు. మానసికంగా చురుకుగా ఉంటారు .వివిధ విషయాలను నేర్చుకోవడం, అన్వేషించడం చేస్తారు. తరచుగా విస్తృతమైన ఆసక్తులు ప్రదర్శిస్తారు.
బుధుడికి చెందిన రాశిలో సూర్యుడి సంచారం వల్ల సంభాషణలో మాధుర్యం ఉంటుంది. తెలివి, హాస్యంతో ఇతరులను ఆకర్షిస్తారు. తెలివితేటలు, అనుకూలత, కమ్యూనికేషన్, నైపుణ్యం, వైవిధ్యం వంటి లక్షణాలను సూర్యుడు అందజేస్తాడు. మనసును ఉత్తేజపరిచే నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకత రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఏ రాశి వారికి సూర్యుడి సంచారం అనుకూలంగా ఉంటుందో చూద్దాం.
మేష రాశి
సూర్య అనుగ్రహం మేష రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు వేసే అడుగులు మిమ్మల్ని విజయవంతం వైపు నడిపిస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగం బలపడుతుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తున్న వారు వృద్ధి చవి చూస్తారు.
వృషభ రాశి
సూర్యుడి సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. జూన్ 15 నుంచి వీరికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు .వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధన లాభం ఉండటం వల్ల ఆర్థిక పక్షం బలోపేతం అవుతుంది. లావాదేవీలకు అనుకూలమైన సమయంగా దీన్ని పరిగణించవచ్చు.
మిథున రాశి
మిథున రాశిలోనే సూర్యుడి సంచారం జరుగుతుంది. పాలక గ్రహం బుధుడు. అందువల్ల ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం ఈ రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలు అందిస్తుంది. గౌరవ, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. అకడమిక్ పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. దీనివల్ల లాభసాటి అవకాశాలు కలుగుతాయి. తెలివిగా తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విదేశాలకు ప్రయాణాలు చేస్తారు. రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటారు.
సింహ రాశి
సూర్యుడి సంచారం సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కార్యాలయంలో ప్రతి ఒక్కరు మీ పనిని ప్రశంసిస్తారు. ఈ సంచారం మీ జీవితంలో ఆనందం, పురోగతిని తీసుకొస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి విశేషమైన ఫలితాలు అందబోతున్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం బాగుంటుంది. జీవిత భాగస్వామితో రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కష్టపడి పని చేయడం ద్వారా మీరు పనులలో కచ్చితంగా విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది.