Sun nakshtra transit: ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు.. వీరి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి
Sun nakshtra transit: సూర్యుడు బుధుడికి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఏ రాశుల వారికి ఆగస్ట్ 2 నుంచి సూర్యుడి సంచారం శుభఫలితాలు ఇస్తుందో చూద్దాం.

Sun nakshtra transit: అన్ని గ్రహాలు రాశులను, నక్షత్రాలను మార్చుకుంటాయి. గ్రహాల సంచారం మానవ జీవితాన్ని ప్రభావితం చేసినట్లే నక్షత్రం మారినప్పుడు కూడా అదే ప్రభావాలను చూపిస్తుంది. సూర్యుడు ప్రస్తుతం శనికి చెందిన పుష్య నక్షత్రంలో సంచరిస్తున్నాడు.
ఆగస్ట్ 2న సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది బుధుడికి చెందిన నక్షత్రం. సూర్యుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల వారికి విజయం సాధించే అవకాశాలు లభిస్తాయి. అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.
ఆశ్లేష నక్షత్రం ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వివిధ ప్రతికూల పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకోగల సమర్థులు. బుధ గ్రహ ప్రభావం ఈ నక్షత్రంలో జన్మించిన వారి మీద అధికంగా ఉంటుంది.
చాలా మంచి మనసు కలిగి ఉంటారు. జ్ఞానం ఎక్కువ.తమ మధురమైన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. గంటల తరబడి ఏదైనా అంశంపై చర్చించగల నైపుణ్యం వీరి సొంతం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇవి వారిని విజయ శిఖరాలకు చేరుస్తాయి. తమ స్నేహితుల కోసం ఏదైనా చేసేందుకు ముందుంటారు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరిని సులభంగా విశ్వసించరు. తమ మాటలతో ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఏయే రాశుల వారికి భారీ లాభాలు కలుగుతాయో చూద్దాం.
వృషభ రాశి
సూర్యుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులకు గొప్ప అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల నుండి డబ్బు సంపాదిస్తారు. అలాగే డబ్బు ఆదా చేయగలుగుతారు.
మిథున రాశి
సూర్యుడి నక్షత్రం మార్పు మిథున రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. అదృష్టం అండగా నిలుస్తుంది. ఉద్యోగస్తులు కెరీర్ లో అన్ని విజయాలు పొందుతారు. వృత్తి జీవితంలో వేసుకున్న ప్రణాళికలు నిజమవుతాయి. అధికారులు మీ పనితో సంతోషిస్తారు. పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. తెలివితేటల వల్ల ప్రతి రంగంలోనూ రాణిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు.
తులా రాశి
తులా రాశి పదో ఇంట్లో సూర్యుడి సంచారం ఉంటుంది. ఇది వృత్తి వ్యాపారం గృహంగా చెప్తారు. ఈ కాలంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో వారి కోరిక నెరవేరుతుంది. విదేశాల నుండి డబ్బులు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ వ్యాపారంలో సానుకుల ఫలితాలు రావడంతో మనసులో ఆనందంగా ఉంటాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.