Sun Transit: తగ్గేదేలే! ఫిబ్రవరి వచ్చిందంటే ఈ మూడు రాశుల వారికి అదృష్టం వచ్చినట్టే!
Sun Transit: సూర్యభగవానుడు శని సొంత రాశియైన కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు, శని భగవానుడి కలయిక ఫిబ్రవరి 2025లో కొన్ని రాశుల వారిపై ధన రాశులు కురిపించనున్నాయి. ఆ రాశుల వారు ఇక్కడ చూద్దాం.
సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. నెలకొకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శక్తి ఆత్మవిశ్వాస కారకుడు. వృత్తి, ఉద్యగోగ, వ్యక్తిగత, ఆర్థిక విషయాలపై ప్రభావం చేపుతాడు. సూర్యుడి స్థానంలో మార్పు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. సింహ రాశికి అధిపతి అయిన సూర్యుడు 2025 ఫిబ్రవరిలో కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశికి శని దేవుడు అధిపతి. ఈ సమయంలో శని, సూర్యుడు కలిసి తమ ప్రమాణాన్ని చేయబోతున్నారు. కనుక ఫిబ్రవరి 2025 కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుటుంది. వీరిపై కాసుల వర్షం కురుస్తుంది. ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి:
2025వ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. దక్కిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని లాభాలు పొందుతారు. పనిచేసే చోట గుర్తింపు దక్కి ప్రమోషన్, వేతన పెంపు లాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. మానవ ఒప్పందాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి పురోగతిని ఇస్తాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మీకు మంచి అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తగ్గుతాయి.
సింహ రాశి:
సూర్య గ్రహం అధిపతిగా ఉండే సింహ రాశికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. తన పాలక గ్రహం స్థానం మారడమనేది మీకు ఉత్తమమైనదిగా మారబోతుంది. ఆర్థికంగా లాభాలు పొంది సిరుల పంట పండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నాయకత్వ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించే యోచన చేయడం వల్ల పరిస్థితులు లాభిస్తాయి. వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. ధనానికి కొదవ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి:
ఈ రాశి వారికి 2025లో కుంభ రాశి అనుకూల ఫలితాలను కల్పిస్తుంది. మంచి ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొత్త అవకాశాలు మీకు మంచి పురోగతిని ఇస్తాయి. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. బాగా రాణించి చక్కటి లాభాలు అందుకుంటారు. రెట్టింపు లాభాలు అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని విషయాలలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. ప్రణాళికాబద్ధమైన పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల పట్ల గౌరవం, మర్యాద పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనానికి లోటు ఉండదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకునే అవకాశం ఉంది.
గమనిక:
ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.