Sun transit effect: సూర్య సంచారం.. నేటి నుంచి నెల రోజుల పాటు వీరికి ఆర్థిక కష్టాలు ఉండబోతున్నాయ్
Sun transit effect: సూర్యుడు మే 14వ తేదీ నుంచి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి నెల రోజుల పాటు ఆర్థిక కష్టాలు ఉండబోతున్నాయి. అవి ఏ రాశులో ఇక్కడ తెలుసుకోండి.

Sun transit effect: సూర్యుడి శుభ ప్రభావం ఉంటే ఏ పనిలోనైనా విజయం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అందుకే సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం, ఆశీర్వాదం మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.
మే 14 నుంచి సూర్యుడు వృషభ రాశి సంచారం చేస్తాడు. ఇది అన్ని రాశులపై వివిధ ప్రభావాలను చూపుతుంది. నెల రోజుల పాటు ఇదే రాశిలో సూర్యుడి సంచారం ఉంటుంది. సూర్యుడి సంచారం వల్ల కొందరు అద్భుతాలను చూస్తే మరి కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని రాశుల జాతకులకు సూర్యుడి సంచారం కారణంగా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సంవత్సరం తర్వాత సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో అక్కడే ఉంటున్న బృహస్పతితో కలిసి గురు ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం చాలా మంచిదిగా పరిగణిస్తారు. వృషభ రాశిలో సూర్యుడి సంచారం వల్ల డబ్బు కొరత ఎదుర్కొనే రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశిలోనే నెల రోజుల పాటు సూర్యుడి సంచారం జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలం వీరికి ప్రయోజనకరంగా ఉండదు. డబ్బు సంపాదించేందుకు తగినంత అవకాశాలు ఉండకపోవచ్చు. ఎంతో కష్టపడితే కానీ చేతికి డబ్బు ఉండదు. బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా డబ్బుని ఆదా చేయలేక పోతారు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది.
మిథున రాశి
సూర్యుడి సంచారం మిథున రాశి వారికి అనుకూలమైన ఆర్థిక ఫలితాలు లభించవు. ఆర్థిక విషయాలను విజయవంతంగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే డబ్బులు కొరత సమస్యలతో బాధపడతారు. అంతేకాకుండా ఖర్చులు బాగా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. ఈ సమయంలో ఆర్థిక పరిమితుల విషయంలో పెద్ద నష్టాలను ఎదుర్కొనే అవకాశం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్యుడి సంచారం అననుకూలంగా ఉంటుంది. ప్రజలకు ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆందోళనను ఎదుర్కొంటూ ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టేందుకు మంచి ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేదంటే డబ్బు సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
తులా రాశి
తులా రాశి వారికి ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూల సమయం కాకపోవచ్చు. సూర్యుడి సంచారం కారణంగా ఆర్థిక నష్టాలకు గురవుతారు. డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా లావాదేవీలు చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది.
మకర రాశి
సూర్యుడి సంచారం వల్ల మకర రాశి వారి జీవితంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. డబ్బు సంపాదించడంలో విఫలమవుతారు. అందువల్ల సరిగా పొదుపు చేయలేకపోతారు. ఈ కాలంలో మీ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించే విషయంలో అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.