వృషభ రాశిలో సూర్యుని సంచారం, మే 15 నుంచి ఈ మూడు రాశులకు ధన యోగం, పదోన్నతి, శుభవార్తలు ఇలా ఎన్నో!-sun transit in tarus and these 3 rasis will get lots of wealth happiness and many more from may 15th ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వృషభ రాశిలో సూర్యుని సంచారం, మే 15 నుంచి ఈ మూడు రాశులకు ధన యోగం, పదోన్నతి, శుభవార్తలు ఇలా ఎన్నో!

వృషభ రాశిలో సూర్యుని సంచారం, మే 15 నుంచి ఈ మూడు రాశులకు ధన యోగం, పదోన్నతి, శుభవార్తలు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

మే నెలలో గ్రహాల రాజు అయిన సూర్యుడు మేష రాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని వృషభ రాశి సంచారం వలన కొన్ని రాశుల వారికి లాభం చేకూరుతుంది. సూర్యుడు వృషభ సంచారం మీకు కూడా లాభాలను ఇస్తోందా లేదో చూసుకోండి.

వృషభ రాశిలో సూర్యుని సంచారం

వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పరాక్రమం, సుఖ సంతోషాలకు కారకుడు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశికి మారుతాడు. సూర్యుని రాశి మార్పు ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది.

ప్రస్తుతం సూర్యుడు మేష రాశిలో ఉన్నాడు. మే 15, 2025న వృషభ రాశిలో సంచరిస్తాడు. జూన్ 14 వరకు ఇదే రాశిలో ఉంటాడు. వృషభ రాశికి అధిపతి చంద్రుడు. సూర్యుని వృషభ సంచారం వలన కొన్ని అదృష్ట రాశుల వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఈ రాశుల వారికి ధన లాభంతో పాటు సామాజికంగా గౌరవం లభిస్తుంది. సూర్యుని వృషభ సంచారం ఏ రాశుల వారికి శుభమో తెలుసుకోండి.

వృషభ రాశిలో సూర్యుడి సంచారంతో ఈ 3 రాశులకు ఊహించని లాభాలు

1. మేష రాశి

సూర్యుని సంచారం మేష రాశి యొక్క ధన, వాక్కు స్థానంలో ఉంటుంది. దీని ప్రభావం వలన మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. దీని వలన వెంటనే లాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది.

2. వృషభ రాశి

సూర్యుడు వృషభ రాశి మొదటి స్థానంలో సంచరిస్తాడు. సూర్యుని ప్రభావం వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు మీ వారి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో మీరు కొత్త గుర్తింపు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ధన పరిస్థితి మెరుగుపడుతుంది.

3. కుంభ రాశి

సూర్యుని రాశి మార్పు కుంభ రాశి నాల్గవ స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో మీ భౌతిక సుఖాలు పెరుగుతాయి. భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. మీ కల నెరవేరుతుంది. ఉద్యోగం చేసే వారికి జీతం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.