Malika raja yogam: శక్తి, విశ్వాసం, ఆనందం, శ్రేయస్సుకు సూర్య భగవానుడిని కారకుడిగా భావిస్తారు. సూర్యుడు జూన్ 15వ తేదీ అర్ధరాత్రి 12:37 గంటలకు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటు ఇదే రాశిలో సంచరిస్తాడు.
వచ్చే నెల జూలై 16వ తేదీ ఉదయం 11:29 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఇప్పటికే మిథున రాశిలో శుక్రుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు ఉన్నారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల అనేక శక్తివంతమైన రాజాయోగాలు ఏర్పడ్డాయి. బుధుడు భద్ర రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య యోగం, త్రిగ్రాహి యోగం ఇస్తున్నాయి. వీటితో పాటు ఈ సమయంలో అన్ని గ్రహాలు ఒకే వరుసలో వచ్చాయి.
మిథునంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుంభ రాశిలో శని, మేష రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, వృషభ రాశిలో బృహస్పతి ఉన్నారు. దీని వల్ల మాలిక రాజయోగం ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో మాలిక రాజయోగం ఏర్పడటం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. జాతకంలో ఒకదాని తర్వాత ఒకటిగా గ్రహాలను మాలలాగా ఉంచితే మాలిక రాజయోగం ఏర్పడుతుందని నమ్మకం. ఈ లాభదాయకమైన రాజయోగంతో ఒక వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో అపారమైన విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మాలిక రాజయోగంతో ఏయే రాశుల వారి అదృష్టం మెరిసిపోతుందో తెలుసుకుందాం.
మాలిక రాజయోగం వల్ల మేష రాశి జాతకులు విపరీతమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పని పూర్తి చేసుకుంటారు.
మాలిక రాజయోగం వల్ల సింహ రాశి జాతకుల చిరకాల కోరిక నెరవేరుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు అదృష్టం పూర్తి మద్దతు పొందుతారు. ఆస్తికి సంబంధించిన చట్టపరమైన వివాదాల నుండి మీరు ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి.
తులా రాశి వారికి మిథునరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కెరీర్‌లో ఎదుగుదల కోసం అనేక సువర్ణావకాశాలు లభిస్తాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.