మిథునంలో సూర్య సంచారం: తేదీ, సమయం, మంత్రాలతో పాటు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!-sun transit in mithuna rasi check time date mantras and remedies to be followed for lord sun blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మిథునంలో సూర్య సంచారం: తేదీ, సమయం, మంత్రాలతో పాటు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!

మిథునంలో సూర్య సంచారం: తేదీ, సమయం, మంత్రాలతో పాటు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు సంచారం అనేక మార్పులను తీసుకువస్తుంది. సూర్యుడు శక్తివంతమైన గ్రహం. సూర్యుడు మానవుని శక్తి, కాంతి, జీవితం, సంకల్పశక్తి, అధికారం, ఆత్మను సూచిస్తాడు. ఈ గ్రహం ప్రతి నెలా స్థానాన్ని మారుస్తుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది.

మిథునంలో సూర్య సంచారం

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అదృష్ట ఫలితాలు ఉంటాయి, మరికొన్ని సార్లు సమస్యలు వస్తాయి.

జూన్ 15 అంటే ఈరోజు సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు సంచారం అనేక మార్పులను తీసుకువస్తుంది. సూర్యుడు శక్తివంతమైన గ్రహం. సూర్యుడు మానవుని శక్తి, కాంతి, జీవితం, సంకల్పశక్తి, అధికారం, ఆత్మను సూచిస్తాడు.

ఈ గ్రహం ప్రతి నెలా స్థానాన్ని మారుస్తుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. జూన్ నెలలో సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. జూన్ 15న అంటే ఈరోజే వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రయాణం చేస్తాడు.

మిధున రాశిలోకి సూర్యుడు ఏ సమయంలో ప్రవేశిస్తాడు?

తేదీ: జూన్ 15, 2025

సమయం: ఆదివారం ఉదయం 6:52

సూర్యుని మిధున రాశి సంచారం 2025 ప్రాముఖ్యత:

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు బలం, అధికారం, జీవితం, ఆధ్యాత్మిక ఉద్దేశానికి చిహ్నం. మిధున రాశికి అధిపతి బుధుడు. కమ్యూనికేషన్, అభ్యాసం, అనుకూలత అందిస్తాడు. సూర్యుడు మిధున రాశిలోకి సంచరించడంతో, ఇది శక్తివంతమైన సమయమని చెప్పొచ్చు. జీవితంలో సామర్థ్యాలను కాపాడుకోవడానికి ఈ ఉత్సాహవంతమైన శక్తిని ఉపయోగించవచ్చు.

మిధున రాశిలో సూర్యుని సంచారం ప్రభావాలు:

  1. కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
  2. నెట్‌వర్కింగ్ పెంపొందించి కొత్త వ్యక్తులతో కనెక్షన్ ఏర్పరచుకోవచ్చు. స్నేహాన్ని పెంపొందించుకోవచ్చు.
  3. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు, కొత్త కోర్సులలో చేరవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు.
  4. కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు.
  5. నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకోవచ్చు.

ఈ పరిహారాలు పాటించాలి:

  1. సూర్యుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నట్లయితే ప్రతి రోజు ఉదయం సూర్యోదయం సమయంలో అర్ఘ్యం సమర్పించి సూర్యుడిని ఆరాధించండి.
  2. చిన్నపిల్లలకు, ట్రాన్స్‌జెండర్లకు డబ్బులు, బట్టలు వంటివి పంపిణీ చేయడం మంచిది.
  3. మీ సోదరీమణులను బాగా చూసుకోండి, కావలసినవి కొనిపెట్టండి.
  4. పెద్దల్ని గౌరవించి ఉదయాన్నే వారి పాదాలను తాకి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందండి.
  5. గోధుమలు, బెల్లం, రాగి వస్తువులను ఆదివారం నాడు దానం చేయడం మంచిది

ఈ మంత్రాలను పఠించండి:

  • ఓం ఘృణి సూర్యాయ నమః॥
  • ఓం బ్రం బ్రీం బ్రోం సః బుధాయ నమః॥
  • ఓం హ్రాం హ్రీం హ్రోం సః సూర్యాయ నమః॥

పైన చెప్పిన ఈ మంత్రాలను 108 సార్లు పఠించి సూర్యుని, బుధుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.