Sun Transit in Libra: ఈ వారంలో రాశిచక్రాన్ని మారబోతున్న సూర్యభగవానుడు, ఒక రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది-sun transit in libra know its impact on all zodiacs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit In Libra: ఈ వారంలో రాశిచక్రాన్ని మారబోతున్న సూర్యభగవానుడు, ఒక రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది

Sun Transit in Libra: ఈ వారంలో రాశిచక్రాన్ని మారబోతున్న సూర్యభగవానుడు, ఒక రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది

Galeti Rajendra HT Telugu

సూర్యభగవానుడు ఈ వారంలో రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మీ రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

తులా రాశిలోకి సూర్యుడు

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. అన్ని గ్రహాలకు రాజు సూర్యభగవానుడు. అక్టోబర్ 17న సూర్యభగవానుడు రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు.

సూర్యుడు అక్టోబరు 17న కన్యా రాశిని వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యభగవానుని రాశి మార్పును సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని తులా సంక్రాంతి అని కూడా పిలుస్తుంటారు.

సూర్యుడు రాశిని మార్చుకోబోతుండటంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, అలానే కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది.

సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

మేష రాశి: ఉద్యోగంలో మీ పరిస్థితి మెరుగవుతుంది. ఈ రాశిలోని ఒంటరి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి కాస్త చేదు అనుభవాలు తప్పవు. అయితే కొన్ని పనుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి : సూర్యుడు రాశిచక్రం మార్పుతో ఈ రాశి వారు అధికం ఆవేశపడే ప్రమాదం ఉంది. మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిది.

కర్కాటక రాశి: గృహ కలహాల సంకేతాలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో వాదనలు దూరంగా ఉండటం ఉత్తమం. వివాదాలు ఏవైనా సామరస్యంగా పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలి.

సింహం రాశి: శక్తి లేదా ఉత్సాహం లోపిస్తుంది. అయితే జీవితంలో వచ్చే మార్పులను సానుకూల దృక్పథంతో స్వీకరించి ముందుకు సాగాలి.

కన్య రాశి: ప్రభుత్వ వ్యవస్థతో అనుబంధం ఏర్పడుతుంది. మీ కెరీర్ పురోభివృద్ధికి అధికారుల నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి.

తులా రాశి: ఆరోగ్యం క్షీణించవచ్చు. వర్క్, లైఫ్ మధ్య బ్యాలెన్స్ పాటిస్తే మంచిది. అయితే.. మునుపటితో పోలిస్తే ఆదాయం రెట్టింపు అవుతుంది.

వృశ్చిక రాశి : ఖర్చులు పెరుగుతాయి. అనాలోచిత కొనుగోళ్లకి దూరంగా ఉండటం ఉత్తమం.

ధనుస్సు రాశి : ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అలానే కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి.

మకర రాశి: వ్యాపారంలో మీరు ఊహించని పురోభివృద్ధి ఉంటుంది. అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి : అదృష్టానికి ఆటంకాలు కనిపిస్తుంటాయి. అయితే పట్టుదల వీడకుండా ప్రయత్నించండి.

మీన రాశి : అశుభ సంకేతాలు కనిపిస్తాయి. అయినప్పటికీ కంగారుపడాల్సిన పనిలేదు. జీవితంలో వచ్చే మార్పులని పాజిటివ్‌గా స్వీకరించండి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.