Sun Transit: నేడు సూర్యుడు శత్రు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు, విధ్వంసం సృష్టిస్తాడు.. దేశంలో ఈ సంఘటనలు జరుగుతాయి-sun transit in kumbha rasi these incidents may happen in the country check remedies to be followed on kumbha sankranti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: నేడు సూర్యుడు శత్రు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు, విధ్వంసం సృష్టిస్తాడు.. దేశంలో ఈ సంఘటనలు జరుగుతాయి

Sun Transit: నేడు సూర్యుడు శత్రు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు, విధ్వంసం సృష్టిస్తాడు.. దేశంలో ఈ సంఘటనలు జరుగుతాయి

Peddinti Sravya HT Telugu
Published Feb 12, 2025 03:00 PM IST

Sun Transit: కుంభరాశిలో సూర్యుని సంచారం ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 10:03 గంటలకు సూర్యుడు తన కుమారుడైన శని రాశిలోకి ప్రవేశిస్తున్నారు. సూర్యుడు, శని కలయిక ఉన్నప్పుడు దేశంలో, ప్రపంచంలో ఊహించని మార్పులు, ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

Sun Transit: నేడు సూర్యుడు శత్రు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు
Sun Transit: నేడు సూర్యుడు శత్రు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు

సూర్యుడిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. రోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన ఆరోగ్యం, సంతోషం కలుగుతాయి. జ్యోతిషంలో సూర్యుడు గ్రహాలకు రాజుగా పరిగణించబడ్డాడు. సూర్యభగవానుడు సంచారం చాలా ముఖ్యమైనది. సూర్యుని ప్రభావం రాశి చక్రంలో ఉన్న ఇతర గ్రహాల శక్తుల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు సూర్యదేవుడు తన రాశిని మార్చబోతున్నాడు.

కుంభరాశిలో సూర్యుని సంచారం ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 10:03 గంటలకు సూర్యుడు తన కుమారుడైన శని రాశిలోకి ప్రవేశిస్తున్నారు. సూర్యుడు, శని కలయిక ఉన్నప్పుడు దేశంలో, ప్రపంచంలో ఊహించని మార్పులు, ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఉద్రిక్తత, భయం, అశాంతి వాతావరణం కూడా సృష్టించబడుతుంది. చాలా సమస్యలను కలిగిస్తుంది. చాలామంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరి కలయిక పెద్ద మార్పులు తీసుకువస్తుంది.

సూర్యుడు సంచారం

సూర్యుడు ఒక రాశి చక్రం నుంచి ఇంకో రాసి లోకి మారడానికి 30 రోజుల సమయం పడుతుంది. సూర్యుడు ఆ తర్వాతే తదుపరి రాశిలోకి వెళ్తాడు. సూర్యుని సంచారం ఒక క్యాలెండర్ సంవత్సరంలో 12 సార్లు మారుతుంది, సూర్యుని సంచార ప్రభావం చంద్ర రాశిపై ఆధారపడి ఉంటుంది. జన్మ చంద్రుడు నుంచి మూడవ, ఆరవ, 11వ ఇంట్లో ఉన్న సూర్యుడు మంచి ఫలితాలని ఇస్తాడు.

సూర్యుని మార్పుతో ప్రపంచం పై ప్రతికూల ప్రభావం

  1. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, శని ఒకరినొకరు శత్రువులుగా పరిగణిస్తారు. ఈ కలయిక ఏర్పడినప్పుడు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి చాలా మందికి సమస్యలు పెరుగుతాయి.
  2. ధర్నాలు, నిరసనలు, అరెస్టులు, రైలు ప్రమాదం వంటివి జరగవచ్చు.
  3. పెద్ద నాయకుల నుంచి విచారకరమైన వార్తలని వినే అవకాశం ఉంటుంది.
  4. చాలామంది మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
  5. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
  6. రాజకీయపరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సూర్యుడు, శని కలయికతో ప్రపంచం పై మంచి ప్రభావం

  1. అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం.
  2. స్టాక్ మార్కెట్ మళ్లీ పెరిగే అవకాశం వంటివి ఉంటాయి.
  3. ఆర్థిక వ్యవస్థ ఇంకా పటిష్టంగా మారే అవకాశాలు ఉంటాయి.
  4. ప్రజలకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
  5. విద్య వ్యవస్థ కూడా బాగుపడే అవకాశం ఉంది.

వీటిని దానం చేయడం మంచిది

  1. కుంభ సంక్రాంతి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం మంచిది.
  2. కుంభ సంక్రాంతి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  3. కుంభ సంక్రాంతి నాడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివితే మంచి ఫలితం ఉంటుంది. సంతోషం కలుగుతుంది.
  4. ఈరోజున సూర్య చాలీసా, సూర్య హారతి, సూర్య స్తోత్రం, ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యుని మంత్రాలు వంటివి చదువుకోవడం వలన ఎంతో పుణ్యం వస్తుంది.
  5. కుంభ సంక్రాంతి రోజున పేదలకు దానం చేయడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
  6. బంగారం, రాగి, ఇత్తడి, కాంస్య లేదా వెండి తో చేసిన కలశాన్ని ఎవరికైనా దానం చేస్తే మంచి జరుగుతుంది.
  7. కుంభ సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేస్తే కూడా విశేష ఫలితం ఉంటుంది.

ఈ పరిహారాలని పాటించొచ్చు

  1. విష్ణువుని పూజించడం
  2. కోతికి లేదా కపిల ఆవుకి ఆహారాన్ని పెట్టడం
  3. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం
  4. ఆదివారం ఉపవాసం ఉండడం
  5. రోజూ బెల్లం లేదా ఏదైనా తియ్యటి పదార్థాన్ని ఇంటి నుంచి బయలుదేరే ముందు తిని నీరు తాగడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail
Whats_app_banner