సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారం వలన కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు జులై 16న సాయంత్రం 5:17కి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం నాలుగు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఇలా ఈ నాలుగు రాశుల వారు బోలెడు లాభాలను పొందవచ్చు.
మేష రాశి వారికి సూర్యుని రాశి మార్పు కొన్ని ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి మంచి జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో సక్సెస్‌ను అందుకుంటారు, వ్యాపారులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ప్రేమ ఫలిస్తుంది, జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే, మేష రాశి వారికి ఈ సమయం చాలా ఉత్తమమైనది.
మిథున రాశి వారికి కూడా సూర్యుని సంచారం ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఉద్యోగులకు సక్సెస్ వస్తుంది, వ్యాపారులకి కూడా ఈ సమయం బాగుంటుంది. ఎప్పటి నుంచో మీ దగ్గరకి రాని ధనం ఈ సమయంలో మీ వద్దకు వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
సింహ రాశి వారికి సూర్యుని రాశి మార్పు అనేక లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు, బాగా సక్సెస్‌ను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది, ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, సోదరుల మధ్య గొడవలు ఆగిపోతాయి. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్‌ను అందుకుంటారు.
కన్యా రాశి వారికి ఈ సమయం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకి కూడా ఇది గోల్డెన్ టైం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబీకుల ఆరోగ్యం బాగుంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.