Sun transit: కర్కాటక సంక్రాంతిలో ఈ ఐదు రాశుల అదృష్టాన్ని మార్చబోతున్న సూర్య భగవానుడు
Sun transit: సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ఐదు రాశుల వారి అదృష్టం మారబోతుంది. ఆ 5 రాశులు ఏవో చూసేయండి.
Sun transit: జూలై 16న సూర్య భగవానుడు రాశిని మార్చబోతున్నాడు. ఈ రోజున సూర్య భగవానుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృష్టం కూడా మేల్కొంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యభగవానున్ని గ్రహాలకు రాజు అంటారు. సూర్యుడు ఏ రాశిలోకి మారితే ఆ రాశి సంక్రాంతిగా పిలుస్తారు. జులై 16న కర్కాటక సంక్రాంతి వచ్చింది. ఈరోజు నుంచి ఉత్తరాయణం ముగిసి దక్షిణాయన కాలంలోకి అడుగుపెడతాము. ఆగస్ట్ 15 వరకు సూర్యుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు.
సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి. ఒకటి దక్షిణాయనం, మరొకటి ఉత్తరాయణం. మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ఏర్పడుతుంది. సూర్యభగవానుడి రాశి మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టము తప్పదు. సూర్యుడి రాశిలో మార్పు వల్ల ఏ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
మేష రాశి
మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. గౌరవ, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక అంశం బలంగా ఉంటుంది. విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు.
మిథున రాశి
విద్యారంగంతో ముడిపడిన ప్రజలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్తలను వింటారు. ఆదాయంలో పెరుగుదల డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరించగలదు. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు, ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది.
సింహ రాశి
సూర్యుడి సంచారంతో సింహ రాశి వారికి ఆదాయం పెరగవచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి
కుటుంబ సభ్యులతో గడుపుతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు శుభ ఫలితాలను పొందుతారు. అకడమిక్ రంగంలో పని చేసే వారికి మంచి రోజులు వస్తాయి. ఆర్థిక లాభానికి అవకాశాలు ఉన్నాయి, ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పని చేయడం ద్వారా మీరు మీ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఓపికతో పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. కార్యాలయంలో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గౌరవం, హోదా, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభం ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.