Sun transit: సూర్యుడి సంచారం.. రేపటి నుంచి వీరికి నెల రోజులు స్వర్ణకాలమే
Sun transit: సూర్యుడు జూన్ 15 నుంచి మిథున రాశిలో తన ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. దీని వల్ల నెల రోజుల పాటు ఐదు రాశుల వారికి స్వర్ణ కాలమే. శుభవార్తలు అందుకుంటారు.
Sun transit: గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా సూర్యుడు ఒక రాశి చక్రం పూర్తి చేయడానికి సుమారు ఒక సంవత్సరం పడుతుంది. జూన్ నెలలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశికి బుధుడు అధిపతి.
జూన్ 15న ఉదయం 04:27 గంటలకు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. జూలై 15 వరకు సూర్యుడు ఈ రాశిలో ఉండి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏడాది తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మిథున రాశిలో సూర్యుని ఉనికి అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్య సంచారము ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి.
మేష రాశి
సూర్య సంచార సమయం మేష రాశి వారికి వరం కంటే తక్కువ కాదు. ఈ కాలంలో వ్యాపారవేత్తలు పురోగతితో పాటు విస్తరణకు కూడా అవకాశం పొందుతారు. ఉద్యోగాలలో పని చేసే వ్యక్తులు పురోగతికి కొత్త అవకాశాలు పొందుతారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది. సూర్యభగవానుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఊహించని లాభాలు ఉంటాయి. గృహంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కార్యాలయంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
సింహ రాశి
సింహ రాశిని పాలించే గ్రహం సూర్యుడు. అందువల్ల సూర్యుడి సంచారం సింహ వారికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఈ కాలంలో మీరు ఆశించిన విజయాన్ని పొందవచ్చు. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంది. ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారానికి ఈ సమయం చాలా శుభదాయకం. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఆరోగ్యం, కెరీర్ పరంగా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ కాలంలో అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. మీరు ప్రతి రంగంలో విజయాన్ని ఆశించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. తక్కువ శ్రమతో విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.
తులా రాశి
తులా రాశి వారికి సూర్య భగవానుడు శుభవార్త తెస్తాడు. సూర్య సంచార ప్రభావం కారణంగా మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఈ కాలంలో మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. కెరీర్‌లో పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి
సూర్య భగవానుడు వృశ్చిక రాశి వారికి శుభవార్త అందించగలడు. ఉద్యోగ ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. వాహన సుఖం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మనసులోని కోరికలు నెరవేరతాయి.