Sun transit: అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం- ఈ రాశులకు శుభకాలం, వ్యాపార విస్తరణకు అవకాశం-sun transit in anuradha nakshtram these zodiac signs get benefits till december 2nd ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం- ఈ రాశులకు శుభకాలం, వ్యాపార విస్తరణకు అవకాశం

Sun transit: అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం- ఈ రాశులకు శుభకాలం, వ్యాపార విస్తరణకు అవకాశం

Gunti Soundarya HT Telugu
Nov 20, 2024 10:44 AM IST

Sun transit: సూర్యుడు ప్రస్తుతం శనీశ్వరుడికి చెందిన అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 2 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీని ప్రభావం వల్ల నాలుగు రాశుల వారకు కలిసొచ్చే కాలంగా మారుతుంది. వ్యాపారం విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు తలుపుతడతాయి.

అనురాధ నక్షత్రంలో సూర్యుడు
అనురాధ నక్షత్రంలో సూర్యుడు

సూర్యుడు నిర్ధిష్ట కాల క్రమేణా తన రాశిని మారుస్తాడు. అదే విధంగా నక్షత్రాన్ని కూడా మారుస్తూ అన్ని రాశులను ప్రభావితం చేస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు నవంబర్ 19 నుంచి తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు.

అనురాధ నక్షత్రంలో ప్రవేశించిన సూర్యుడు డిసెంబర్ 2 వరకు ఉంటారు. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, సూర్యుడి మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ఉంది. శని నక్షత్రంలో సూర్యుడి రాక కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. మరికొన్ని రాశుల వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల ఏయే రాశుల వారి భవితవ్యం మారుతుందో తెలుసుకుందాం.

అనురాధ నక్షత్రం

ఇరవై ఏడు నక్షత్రాలలో అనురాధ నక్షత్రం 17వ స్థానంలో ఉంటుంది. దీనికి శని అధిపతిగా ఉండటం వల్ల వీరి ప్రవర్తన కొన్ని సార్లు భిన్నంగా ఉంటుంది. ఉత్సాహంగాను, ఉద్రేకంగాను ఉంటారు. కష్టపడేతత్వం వీరిది. ఒత్తిడితో కూడిన జీవితం జీవిస్తారు. అయితే కుటుంబ సభ్యుల మద్ధతు వీరికి ఉండకపోవచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం వీరి సొంతం. ఏదైనా లక్ష్యం సాధించేందుకు అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే వీరిది పోరాట జీవితం. వాటి నుంచి జీవిత పాఠాలు నేర్చుకుంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు.

మేష రాశి

సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుంది. కఠోర శ్రమతో మీ పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి.

మిథున రాశి

సూర్య నక్షత్ర సంచారం మిథున రాశి వారికి లాభాలు తీసుకొస్తుంది. జీవితంలో ఆర్థిక పురోగతి పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చేసే ప్రయనాలు లాభించే అవకాశాలు ఉన్నాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ కాలం శుభదాయకంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. పెట్టుబడులపై మంచి రాబడి కలుగుతుంది. క్లిష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం విజయాలను అందిస్తుంది. ప్రత్యర్థుల మీ చేతిలో ఓటమి చవి చూస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ వృత్తిలో గొప్ప విజయాలు నమోదు చేసుకుంటారు.

మీన రాశి

మీన రాశి వాళ్ళు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు విజయం చేకూరుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మంచి రోజులు ఏర్పడతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner