త్వరలో వృషభ రాశిలో సూర్యుని సంచారం, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు.. ధనం, పదోన్నతి ఇలా ఎన్నో-sun transit change in vrishabha rasi from may and these 4 rasis will get unexpected changes in life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  త్వరలో వృషభ రాశిలో సూర్యుని సంచారం, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు.. ధనం, పదోన్నతి ఇలా ఎన్నో

త్వరలో వృషభ రాశిలో సూర్యుని సంచారం, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు.. ధనం, పదోన్నతి ఇలా ఎన్నో

Peddinti Sravya HT Telugu

సూర్యుడు మే నెలలో మేష రాశి నుండి బయటకు వచ్చి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో సూర్యుని రాక వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది. సూర్య సంచారం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.

త్వరలో వృషభ రాశిలో సూర్యుని సంచారం

వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి బయటకు వచ్చి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ప్రస్తుతం మేష రాశిలో సంచారం చేస్తున్నాడు. 2025 మే 15 గురువారం నాడు వృషభ రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు 2025 జూన్ 14 వరకు వృషభ రాశిలో ఉంటాడు.

2025 జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశిలో సూర్యుని సంచారం వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ అదృష్ట రాశుల వారికి వృత్తి, ఆర్థిక మరియు వృత్తిపరమైన విజయాలు లభిస్తాయి. మరి మీరూ ఈ అదృష్ట రాశుల్లో ఒకరేమో చూసుకోండి.

సూర్యుని వృషభ రాశి సంచారంతో ఈ 4 రాశులకు ఊహించని లాభాలు

1.మిథున రాశి :

సూర్యుడు మిథున రాశి సంచారంతో ఈ రాశి వారికి సూర్యుని ప్రభావం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన, సాన్నిహిత్యం పెరుగుతాయి. పెట్టుబడిపై మంచి రాబడి పొందుతారు. ఆర్థికంగా, మీరు మంచి స్థితిలో ఉంటారు.

2.కన్యా రాశి

కన్యా రాశి వారు సూర్య రాశి మార్పు వల్ల శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడు కన్యా రాశిలోని పదవ ఇంట్లో సంచరిస్తాడు. సూర్యుని ప్రభావం వల్ల మీరు వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. మీకు కొత్త హోదా లేదా బాధ్యత లభించవచ్చు. సంబంధాలు మెరుగుపడతాయి.

3.సింహ రాశి

సింహ రాశి వారికి సూర్యుని రాశి మార్పు శుభదాయకంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పనినైనా పూర్తిచేస్తారు. జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి సూర్య సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్య భగవానుడి ప్రభావంతో పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగానే కాకుండా వృత్తిపరంగా పురోగతి సాధించే అవకాశాలున్నాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం