రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం, ఈ మూడు రాశులకు సమస్యలు.. జాగ్రత్త సుమా!-sun star transit in rohini these 3 zodiac signs might suffer with problems be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం, ఈ మూడు రాశులకు సమస్యలు.. జాగ్రత్త సుమా!

రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం, ఈ మూడు రాశులకు సమస్యలు.. జాగ్రత్త సుమా!

Peddinti Sravya HT Telugu

సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా ఈ రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మూడు రాశులకు సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం వలన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

రోహిణి నక్షత్రంలో సూర్యుడి సంచారం

గ్రహాలకి రాజు సూర్యుడు మే 15న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటు వృషభరాశిలోనే సంచరిస్తాడు. మే 25న అంటే మరో నాలుగు రోజుల్లో రోహిణి నక్షత్రం లోకి అడుగు పెడతాడు.

సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి సమస్యలు రావచ్చు. 12 రాశులపై సూర్యుడి నక్షత్ర సంచారం ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారంతో ఈ మూడు రాశులకి నష్టాలు

సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా ఈ రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మూడు రాశులకు సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం వలన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.మిధున రాశి

మిధున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ సమయంలో వారిపై వారికి నమ్మకం తగ్గుతుంది. కొత్త బాధ్యతల్ని స్వీకరించినప్పుడు పని ప్రదేశంలో ఇబ్బందులు కలగవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగడం మంచిది. కోర్టు కేసుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

2.తులా రాశి

తులా రాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సమయంలో చదువు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి ఉద్యోగులకి జీతం పెరిగినప్పటికీ ఖర్చులు ఎక్కువవుతాయి.

3.కుంభ రాశి

కుంభ రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం వలన వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెళ్లి కుదరక ఇబ్బందులు పడుతున్న వారికి పెళ్లి కుదరడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.