Sun transit: సూర్య సంచారం ఈ రాశుల వారికి ఐశ్వర్యం, అదృష్టం తీసుకువస్తుంది
Sun transit: దాదాపు 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో శని, సూర్య కలయిక జరగబోతుంది. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఐశ్వర్యం, ఆనందం తీసుకురాబోతుంది.
Sun transit: గ్రహాల రాజు సూర్యుడు తమ రాశి చక్రం మార్చుకున్నాడు. మకర రాశి నుంచి శని సొంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఇవి రెండు శత్రు గ్రహాలు. దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శని, సూర్య గ్రహాలు కలుసుకున్నాయి.
సూర్యుడు నెలా నెలా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. అలా మార్చి 15 వరకు సూర్యుడు కుంభ రాశి సంచారం చేస్తాడు. కుంభ రాశిలో శని, సూర్య కలయిక నాలుగు రాశుల వారికి అదృష్టం, శ్రేయస్సు కలగనుంది. ఈ రాశుల వారికి సూర్యుడి సంచారం అనుకూల ప్రయోజనాలు ఇస్తుంది. ఈ సమయంలో ఏవైనా పనులు తలపెడితే వాటిలో విజయం సాధిస్తారు. శని, సూర్య సంయోగం వల్ల అదృష్టం పొందే రాశులు ఏవంటే..
మేష రాశి
మేష రాశి వారి శని సూర్య కలయిక శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారి కీర్తి, ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. సంపద పెరుగుతుంది.
మిథున రాశి
రెండు శత్రు గ్రహాల కలయిక మిథున రాశి వారికి అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు ఎదురైన సవాళ్ళ నుంచి ఉపశమనం కలుగుతుంది. కెరీర్ లో సవాళ్ళు తొలగిపోయి ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఈ సమయంలో అది నెరవేరుతుంది. కుటుంబ జీవితం సంతోషంతో నిండిపోతుంది. ఆనందకరమైన వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు.
సింహ రాశి
శని, సూర్య సంయోగం సింహ రాశి వారికి అన్నింటా విజయాన్ని ఇస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్తగా ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారం విస్తరించుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ దొరుకుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
కుంభ రాశి
కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశిలోనే సూర్యుడు సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల కుంభ రాశి వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలని సాధిస్తారు.
వీరికి కష్టాలే
శని, సూర్య కలయిక పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులు జాతకులకు అదృష్టం తలుపులు తెరుచుకుంటే మరికొన్ని రాశుల వారికి కష్టాలు చుట్టుముడతాయి.
కర్కాటకం, మీనం, కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అశుభ ఫలితాలు ఇస్తుంది. జీవితంలో ముఖ్యమైన విషయాల్లో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పొరపాటున కూడా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. న్యాయపరమైన కేసుల్లో కూడా మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దాంపత్య జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి. కోపం తగ్గించుకుంటే కొన్ని సమస్యల నుంచి బయట పడగలుగుతారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంది.