Sun Saturn Conjunction: కుంభ రాశిలో సూర్యుడు, శని కలయిక.. ఈ మూడు రాశుల వారికి మార్చి 14 వరకు ఫుల్లు అదృష్టం
Sun Saturn Conjunction: జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, శని కలయిక ప్రభావం మొత్తం 12 రాశులపై కనిపిస్తుంది. కొన్ని రాశులకు శని-సూర్యుడు కలిసి అదృష్టాన్ని కలిగిస్తే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సిన వస్తుంది. అదృష్టంతో పాటు మరెన్నో లాభాలను పొందే రాశుల గురించి చూద్దాం.

సూర్యుడు, శని కుంభ రాశిలో ఉన్నారు. సూర్యుడు ఫిబ్రవరి 13 న మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. మార్చి 14 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఈ విధంగా కుంభరాశిలో సూర్యుడు, శని కలయిక సుమారు నెల రోజుల పాటు ఉంటుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, శని కలయిక ప్రభావం మొత్తం 12 రాశులపై కనిపిస్తుంది. కొన్ని రాశులకు శని-సూర్యుడు కలిసి అదృష్టాన్ని కలిగిస్తే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సిన వస్తుంది. అదృష్టంతో పాటు మరెన్నో లాభాలను పొందే రాశుల గురించి చూద్దాం.
1.ధనుస్సు రాశి :
సూర్య-శని కలయిక ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. జీవితంలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అనేక అవకాశాలు లభిస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా, పరిస్థితి బలంగా ఉంటుంది. పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
2. కన్యా రాశి:
సూర్య-శని కలయిక కన్యా రాశి ఆరవ ఇంట్లో ఉంటుంది. శని-సూర్య కలయిక ప్రభావం కన్యా రాశి వారికి ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేస్తుంది. ప్రేమ జీవితానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలోని అనేక అంశాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి.
3. వృషభ రాశి :
సూర్యుడు, శని కలయిక వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో, మీ ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు పాత వనరుల నుండి డబ్బు కూడా వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెట్టుబడిపై మంచి రాబడి పొందొచ్చు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం