Lucky zodiac signs: 500 ఏళ్ల తర్వాత ఐదు రాజాయోగాలు.. మరికొన్ని రోజుల పాటు వీరికి పట్టిందల్లా బంగారమే-sun mercury venus jupiter saturn mars will create five raja yogas after 500 years ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: 500 ఏళ్ల తర్వాత ఐదు రాజాయోగాలు.. మరికొన్ని రోజుల పాటు వీరికి పట్టిందల్లా బంగారమే

Lucky zodiac signs: 500 ఏళ్ల తర్వాత ఐదు రాజాయోగాలు.. మరికొన్ని రోజుల పాటు వీరికి పట్టిందల్లా బంగారమే

Gunti Soundarya HT Telugu
Jun 04, 2024 04:30 PM IST

Lucky zodiac signs: చాలా ఏళ్ల తర్వాత ఐదు రాజయోగాలు ఏర్పడి అనేక రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందిస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు రాజయోగాల ప్రభావంతో వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

500 ఏళ్ల తర్వాత ఐదు రాజయోగాలు
500 ఏళ్ల తర్వాత ఐదు రాజయోగాలు (Pixabay)

Lucky zodiac signs: అనేక గ్రహాల సంచారం వల్ల సుమారు 500 సంవత్సరాల తర్వాత ఐదు రాజయోగాలు ఏర్పడ్డాయి. గ్రహాల రాజు సూర్యుడు, బుధుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాల కదలిక వల్ల ఈ రాజయోగాలు ఏర్పడినట్టు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నాలుగు రాజయోగాలు వృషభరాశిలోనే ఏర్పడ్డాయి. ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అందువల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది. ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు, గ్రహాల రాజు సూర్యుడు కూడా వృషభ రాశిలోనే సంయోగం చెందారు. దీని ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టించారు.

శని దాని అసలు త్రికోణ రాశి అయిన కుంభ రాశిలో ఉండటం వల్ల శశ రాజయోగం ఏర్పడింది. ఈ ఏడాది మొత్తం శని శశ రాజయోగం ఇస్తున్నాడు. అలాగే వృషభ రాశిలో గురు, శుక్ర కలయికతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ ఐదు రాజయోగాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. వీటి ఫలితంగా కొన్ని రాశుల వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది. అవి ఏ రాశులకో తెలుసుకుందాం.

మేష రాశి

బుధుడు, కుజుడు, సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు, శని సంచారం మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ప్రతి సమస్యను అవగాహనతో పరిష్కరించుకుంటూ వెళతారు. తెలివితేటలతో వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.

వృషభ రాశి

అనేక గ్రహాల కలయికకు వేదికగా వృషభ రాశి మారింది. సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు వృషభ రాశిలోనే ప్రస్తుతం సంచరిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో బృహస్పతి మినహా మూడు గ్రహాలు మిథున రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో ఆరు గ్రహాల సంచార ప్రభావం ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. సంతానంవైపు నుంచి శుభవార్త దొరుకుతుంది. భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు క్రమంగా సమసిపోతాయి. అత్యంత శుభకరమైన బృహస్పతి, శుక్ర గ్రహాల ప్రభావంతో వృషభ రాశి వారికి అన్నీ మంచి రోజులే ఉండనున్నాయి. ఈ ఏడాది మొత్తం బృహస్పతి ఈ రాశిలోనే ఉంటా.డు అందువల్ల వీరికి గురు గ్రహ ఆశీర్వాదం ఏడాది పొడవునా కొనసాగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి.

కుంభ రాశి

శని సంచారం ఈ ఏడాది కుంభ రాశిలోనే జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలను అధిగమించి భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. ఉద్యోగం మారెందుకు ఇది అనువైన సమయం.

 

WhatsApp channel