జూలైలో సూర్యుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుల సంచారం.. ఈ మూడు రాశులకు ధన లాభం, అదృష్టం, ప్రమోషన్లు ఇలా ఎన్నో!-sun mars moon venus transit in july month and it give many benefits to gemini virgo and tarus ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూలైలో సూర్యుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుల సంచారం.. ఈ మూడు రాశులకు ధన లాభం, అదృష్టం, ప్రమోషన్లు ఇలా ఎన్నో!

జూలైలో సూర్యుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుల సంచారం.. ఈ మూడు రాశులకు ధన లాభం, అదృష్టం, ప్రమోషన్లు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

రాబోయే నెలలో సూర్యుడు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. జూలై మాసంలో ఈ గ్రహాల సంచారం కొన్ని రాశుల అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

july month planets change

ఈ సంవత్సరం జూలై నెల చాలా ప్రత్యేకమైనది, ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జూలై నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచరించబోతున్నాయి. రాబోయే నెలలో సూర్యుడు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు తమ రాశిచక్రాలను మారుస్తారు. అదే సమయంలో బుధుడు రాశి మార్పు కూడా జరుగుతుంది.

శని మీన రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు ఉంటారు. అటువంటి పరిస్థితిలో, జూలై నెలలో ఈ గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు వస్తుంది. మరి ఏయే రాశుల వారికి జూలై నెల కలిసి రాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇపుడే తెలుసుకుందాం.

జూలై నెలలో ఈ రాశులకు ఫుల్లుగా అదృష్టం

1.వృషభ రాశి :

జూలై మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ప్రమోషన్ ని కూడా పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన వాటిని మీరు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒంటరి వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు. ఈ సమయంలో, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేస్తారు.

2.కన్య రాశి :

కన్యా రాశి వారికి జూలై మాసంలో శుభదాయకంగా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీరు పనిప్రాంతంలో ప్రశంసలను కూడా పొందవచ్చు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మనస్సు చదువులో నిమగ్నమవుతుంది. కానీ మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

3.మిథున రాశి :

జూలై మాసంలో మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో జరుగుతున్న పరస్పర విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారం చేసే వారికి మంచి ఇన్వెస్టర్ దొరుకుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.