ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18న వచ్చింది. అక్టోబర్ 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుజుడు అదే రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య, కుజుల కలయిక ఏర్పడుతుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ అరుదైన సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది.
జీవితంలో అనేక సానుకూల మార్పులను చూస్తారు. ఈ సంయోగం కారణంగా లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. విజయాలను అందుకుంటారు. మరి ఇక ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి వారికి సూర్య–కుజుల సంయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ రాశి వారు ఈ సమయంలో కుబేరుడు, లక్ష్మీదేవిల అనుగ్రహాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తులా రాశి వారికి రెండు గ్రహాల కలయిక అనేక విధాలుగా కలిసివస్తుంది. శుభవార్తల్ని వింటారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. అపోహలు, బాధల నుంచి బయట పడవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలగవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఊహించని విధంగా లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విజయాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
కుంభ రాశి వారికి రెండు గ్రహాల కలయిక అనేక విధాలుగా కలిసివస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి.