18 ఏళ్ళ తర్వాత సూర్య–కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్త సుమా!-sun ketu conjunction to bring problems to leo aquarius and pisces ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  18 ఏళ్ళ తర్వాత సూర్య–కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్త సుమా!

18 ఏళ్ళ తర్వాత సూర్య–కేతువుల సంయోగం, ఈ 3 రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్త సుమా!

Peddinti Sravya HT Telugu

ఆగస్టు 17న గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఇప్పటికే సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య–కేతువుల సంయోగం జరుగుతుంది. 18 ఏళ్ల తర్వాత సూర్య–కేతువుల సంయోగం జరగనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఎవరు ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాలి?

సూర్య–కేతువుల సంయోగంతో ఈ రాశుల వారికి సమస్యలు (pinterest)

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు. ఆగస్టు 17న గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఇప్పటికే సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య–కేతువుల సంయోగం జరుగుతుంది. 18 ఏళ్ల తర్వాత సూర్య–కేతువుల సంయోగం జరగనుంది.

సూర్య–కేతువుల సంయోగం

ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం సూర్య–కేతువుల సంయోగం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సూర్య–కేతువుల సంయోగం సమస్యలను తీసుకొస్తుంది? ఎవరు ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాలి?

సూర్య–కేతువుల సంయోగంతో ఈ రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్తగా ఉంటే మంచిది

1.సింహ రాశి

సింహ రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం సమస్యలు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సామర్థ్యం, నమ్మకం తగ్గుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వడం, ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు.

2.కుంభ రాశి

కుంభ రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

3.మీన రాశి

మీన రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఉపశమనాన్ని పొందలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.