మరి కొన్ని రోజుల్లో సూర్య-కేతువుల సంయోగం, ఈ మూడు రాశులకి పట్టిందల్లా బంగారం.. డబ్బు, ఆస్తులు, ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!-sun ketu conjunction to bring immense wealth property house vehicles and many more to tarus cancer scorpio ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మరి కొన్ని రోజుల్లో సూర్య-కేతువుల సంయోగం, ఈ మూడు రాశులకి పట్టిందల్లా బంగారం.. డబ్బు, ఆస్తులు, ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!

మరి కొన్ని రోజుల్లో సూర్య-కేతువుల సంయోగం, ఈ మూడు రాశులకి పట్టిందల్లా బంగారం.. డబ్బు, ఆస్తులు, ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

గ్రహాల సంచారం జరిగినప్పుడు, ఒక్కోసారి మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటిప్పుడు కూడా శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు, కుజ గ్రహంతో సంయోగం చెందుతాడు. ప్రస్తుతం కేతువు సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య-కేతువుల సంయోగం జరుగుతుంది.

మరి కొన్ని రోజుల్లో సూర్య-కేతువుల సంయోగం (pinterest)

గ్రహాలు కాలానికి గుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు కూడా ఏర్పడతాయి. గ్రహాల సంచారం జరిగినప్పుడు, ఒక్కోసారి మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటిప్పుడు కూడా శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్రహాలకు రాజు సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు నెలలో సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు, కుజ గ్రహంతో సంయోగం చెందుతాడు. ప్రతి నెలా కూడా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు.కేతువు ప్రతి ఏడాదిన్నరకు ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు.

సూర్య-కేతువుల సంయోగం

ప్రస్తుతం కేతువు సింహ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కేతువు సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య-కేతువుల సంయోగం జరుగుతుంది.

ఇది అన్ని రాశుల వారికి శుభ పరిణామాలను అందిస్తుంది. కానీ, కొన్ని రాశుల వారు మాత్రం విపరీతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ మూడు రాశుల వారికి, ఈ రెండు గ్రహాల కలయిక శుభప్రదం, మంచి రోజులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు.

సూర్య-కేతువుల సంయోగంతో ఈ మూడు రాశులకి పట్టిందల్లా బంగారం:

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి సూర్య-కేతువుల సంయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. కెరీర్ కూడా బాగుంటుంది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఇంప్రూవ్ అవుతుంది, కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. డబ్బు, ఆస్తులు కూడా వస్తాయి.

3.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి సూర్య-కేతువుల సంయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు, అదృష్టం కూడా కలిసి వస్తుంది. దేశ విదేశాల్లో ప్రయాణాలు చేస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా కలిసి వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.