గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశుల నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత దరిద్ర రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశి వారికి సమస్యలను తీసుకువస్తుంది.
గ్రహాల సంచారం ఒక్కోసారి అశుభ ఫలితాలను కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో చూసినట్లయితే సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడడంతో దరిద్రయోగం ఏర్పడుతుంది.
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు సతమతం అవ్వాల్సి ఉంటుంది. మరి ఏయే రాశుల వారికి సమస్యలు వస్తాయి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ దరిద్ర రాజయోగం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి కలుగుతుంది. ఆర్థికపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.
సింహ రాశి వారికి ఈ దరిద్ర రాజయోగం కొన్ని సమస్యలను తీసుకొస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎలాంటి పని చేసినా సరిగ్గా కలిసి రాదు. ఈ సమయంలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
వృషభ రాశి వారికి కూడా ఇది సమస్యలను తీసుకొస్తుంది. సూర్య–కేతువుల సంయోగంతో ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి వారికి సూర్య–కేతువుల కలయిక నష్టాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ధ పెడితే, అంత మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.