Guru aditya yogam: గురు ఆదిత్య యోగం.. వృషభ రాశిలో సూర్యుడి రాకతో వీరి తలరాత మారబోతుంది
Guru aditya yogam: వృషభ రాశిలో మే 14వ తేదీ నుంచి సూర్యుడి సంచారం జరగనుంది. అదే రాశిలో ఉన్న బృహస్పతితో కలవడం వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. ఏ రాశుల వారికి ఇది అదృష్టాన్ని ఇస్తుందో చూడండి.
Guru aditya yogam: గ్రహాల రాజు సూర్యుడు మంగళవారం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు. జ్ఞానోదయం, ప్రభుత్వ ఉద్యోగం, ఆనందం వంటి వాటికి సూర్యుడిని కారకుడిగా భావిస్తారు.
వృషభ రాశిలో ఇప్పటికే బృహస్పతి ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో సహా అన్ని జీవులపై ప్రభావం చూపుతుంది. సూర్యుడు లగ్న గృహంలో సంచరిస్తాడు. స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు, మోటారు రంగంలో పురోగతి ఉంటుంది. వ్యాధితో పోరాడే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అంతర్జాతీయ సమాజంలో కూడా భారత్ ఆధిపత్యం పెరుగుతుంది. విదేశీ లాభాలకు మంచి అవకాశం ఉంది. సూర్య సంచారం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి రెండో ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. బుద్ధి సంపదకు వనరుగా మారుతుంది. మేధో సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ కాలం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలరు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక స్థితి, ప్రతిష్ట పెరుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. అలాగే ఎవరి దగ్గర ఎటువంటివి ఉచితంగా తీసుకోవద్దు.
వృషభ రాశి
సూర్యుడి సంచారం వృషభ రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తోంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. గృహ, వాహనంలో సుఖం పెరిగే అవకాశం ఉంది. సూర్యుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం స్తోత్రం పఠించాలి.
మిథున రాశి
మిథున రాశి ఖర్చుల గృహంలో సూర్యుడు సంచరిస్తాడు. అందువల్ల మీకు ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పోటీల్లో విజయం సాధిస్తారు. తోబుట్టువూ, స్నేహితులకు సంబంధించిన విషయాల్లో గొడవ అయ్యే అవకాశం ఉంది. దాతృత్వం, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్యుడు సంపదను ఇవ్వబోతున్నాడు. లాభాల గృహంలో సంచరిస్తాడు. డబ్బుకు సంబంధించిన పనులలో పురోగతి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. మేధో సామర్థ్యం కారణంగా డబ్బు పొందే అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి చేతికి వస్తుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ముల్లంగిని దేవాలయంలో దానం చేయాలి.
సింహ రాశి
సింహ రాశి వారి జాతకంలో సూర్యుడు పదో స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయంలో సామాజిక హోదా, గౌరవం పెరుగుతుంది. కష్టపడి పని చేసే అవకాశం ఉంటుంది. వృద్ధి వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యుని మంత్రాలని పఠించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్యుడు ఖర్చు అయ్యే గృహంలో సంచరిస్తాడు. అందువల్ల పనుల్లో అదృష్టం తక్కువగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వైద్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెడతారు. ఆకస్మిక ప్రయాణాలతో డబ్బులు ఖర్చు అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకం క్రమం తప్పకుండా చదవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి ఎనిమిదో ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. ఫలితంగా లాభాలు పొందేందుకు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబం కార్యక్రమాల కోసం ఖర్చులు పెరుగుతాయి. పని ప్రాంతంలో ఆహ్లాదకర పరిస్థితి ఉండకపోవచ్చు. సమస్యల నుంచి బయటపడేందుకు సూర్య కవచం ఆదిత్య హృదయ స్తోత్రం జపించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గురు ఆదిత్య యోగం వల్ల ఉద్యోగం, సామాజిక హోదా, ప్రతిష్ట, గౌరవాన్ని ఇస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. భాగస్వామ్య పనులు లాభాలను తెస్తాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూల మెరుగుదల ఉంటుంది. వైవాహిక జీవితంలో, ప్రేమ సంబంధాల్లో టెన్షన్ పరిస్థితి ఉంటుంది. సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం ఉపవాసం ఉంటే సూర్యుడి అనుగ్రహం పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సూర్యుడి సంచారం కలిసి రాకపోవచ్చు. పనిలో అదృష్టం తక్కువగా ఉంటుంది. కొద్ది సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతారు. వీటి నుంచి బయటపటటానికి సూర్య ఆధర్వ శీర్ష పారాయణం చేయడం ముఖ్యం.
మకర రాశి
మకర రాశి వారికి సూర్యుడి సంచారం ఆందోళన కలిగించే పరిస్థితులను తీసుకొస్తుంది. మేధో సామర్థ్యాలను సక్రమంగా ఉపయోగించుకోలేరు. బోధన, అభ్యసనకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. సూర్యుని తాంత్రిక మంత్రాలు పఠించాలి. లేదంటే సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఆనందానికి సంబంధించిన పనులలో పురోగతి ఉంటుంది. గృహ వాహన సుఖాలలో పురోభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం అనుకూలం. భాగస్వామి చర్యల వల్ల లాభం పొందే అవకాశం ఉంది. ఆదివారం అంధులకు ఆహారం ఇవ్వాలి.
మీన రాశి
సూర్యుడు సంచారం వల్ల మీన రాశి వాళ్ళు శత్రువులపై విజయం సాధించే అవకాశం లభిస్తుంది. అధికారం పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. సూర్యాష్టకం క్రమం తప్పకుండా జపించాలి.