Budhaditya Yogam: వృశ్చిక రాశిలోకి సూర్యుడు- ఈ బుధాదిత్య యోగం మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది
Budhaditya Yogam: సూర్యుడు వృశ్చికంలోకి ప్రవేశించిన వెంటనే బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి వరకు బుధుడు ఈ రాశిలో ఉంటాడు. ఈ బుధాదిత్య యోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
సూర్యుడు తన వేగాన్ని మార్చుకున్నాడు. నవంబర్ 16న గ్రహాల రారాజు సూర్యుడు అంగారకుడి రాశిలోకి ప్రవేశించాడు. గ్రహాల రాకుమారుడు బుధుడు అప్పటికే వృశ్చికంలో ఉన్నాడు. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత అది బుధుడితో కలయికను ఏర్పరుస్తుంది. దీని వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని శుభ యోగంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, సూర్యుడు డిసెంబర్ 15 వరకూ బుధుడితో కలయికలోనే ఉంటాడు. ఈ బుద్ధాదిత్య యోగం డిసెంబర్ 14 వరకు ఉంటుంది. అప్పటి వరకూ కొన్ని రాశుల వారికి చాలా అంతులేని అదృష్టం కలుగుతుంది. ఏయే రాశుల వారికి సూర్య-బుధుల సంచారం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
వృశ్చికంలో బుధుడు-సూర్యుడు, 3 రాశుల వారికి మేలు
తులా రాశి:
తులా వారికి సూర్యుడు, బుధుడి సంచారం అత్యంత యోజనకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఫలితాలు లభిస్తాయి. గ్రహాల శుభ ప్రభావం వల్ల వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో వచ్చే సమస్యలు, చిక్కులు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉంచడానికి ప్రకృతిలో సమయాన్ని గడపండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
వృశ్చిక రాశి:
బుధుడు, సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఈ సమయం మంచిదని భావిస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. కొంత మంది అప్పుల నుంచి బయటపడగలుగుతారు. సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు శుభ సమాచారం అందుతుంది. వ్యాపార విస్తరణ చేపడతారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు ప్రోత్సహం లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు కలసివస్తుంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు.
మకర రాశి:
ఈ బుధాదిత్య యోగం మకర రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. బాధ్యతలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి శుభవార్త అందుతుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. మునుపటితో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సును ఆరాధనలో నిమగ్నం చేయడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మకర
రాశి వారికిబుధుడు, సూర్యుడి సంచారం లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి శుభవార్త అందుతుంది. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. మునుపటితో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సును ఆరాధనలో నిమగ్నం చేయడం మంచిది.
వృశ్చిక రాశి బుధ, సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఈ సమయం మంచిదని భావిస్తారు. డబ్బు వస్తుంది. కొంత మంది అప్పుల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయాన్ని పెట్టుబడిగా కూడా పరిగణిస్తారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.