Sun transit: రాశి మారబోతున్న గ్రహాల రాజు.. వీరికి ఆర్థిక లాభాలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు-sun enter into vrishabha rasi these zodiac signs get finacial benefits and respect ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: రాశి మారబోతున్న గ్రహాల రాజు.. వీరికి ఆర్థిక లాభాలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు

Sun transit: రాశి మారబోతున్న గ్రహాల రాజు.. వీరికి ఆర్థిక లాభాలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు

Gunti Soundarya HT Telugu
May 04, 2024 06:05 PM IST

Sun transit: గ్రహాల రాజు సూర్యుడు త్వరలో రాశి మారబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతుంది. ఏయే రాశుల వారికి ఆ అదృష్టం దక్కుతుందో చూసేయండి.

రాశి మారబోతున్న గ్రహాల రాజు
రాశి మారబోతున్న గ్రహాల రాజు

Sun transit: ప్రస్తుతం మేషరాశిలో ఉన్న గ్రహాల రాజు సూర్యుడు మరికొద్ది రోజుల్లో శుక్రుడికి చెందిన రాశులో సంచరించబోతున్నాడు. సూర్యుడి స్థానం శుభప్రదం అయితే ఆ వ్యక్తి అదృష్టం ప్రకాశిస్తుంది. అతనికి గౌరవం కూడా లభిస్తుంది.

నెలకు ఒకసారి సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా పిలుస్తారు. మే 13న సూర్య భగవానుడు తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. అక్షయ తృతీయ జరిగిన మూడు రోజులకు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి చక్రం మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఖాయం. సూర్యుడి సంచారం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. శుక్రుడు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఏయే రాశుల వారి భవితవ్యం మారుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశిని వదిలి సూర్యుడి వృషభ రాశిలోకి వెళతాడు. ఫలితంగా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో లక్ష్యాలపై దృష్టి పెట్టి గమ్యాన్ని చేరుకుంటారు. పనికి ప్రశంసలు లభిస్తాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబ సభ్యుల మద్ధతులో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.

వృషభ రాశి

సూర్యుడి సంచారం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగవుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

మిథున రాశి

సూర్యుడు సంచారం మిథున రాశి వారి వైవాహిక జీవితం సంతోషంతో నిండిపోతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. సమాజంలో ప్రతిష్ట, హోదా పెరుగుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది. మిథున రాశి వారికి సమయం ఒక వరం లాంటిది.

సింహ రాశి

ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సింహ రాశి వారికి ఈ సమయం చాలా శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. పని ప్రాంతంలో మీ కష్టాలు తీరిపోతాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కన్యా రాశి

విద్యా రంగానికి సంబంధించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ పనిని ప్రశంసిస్తారు. ఆర్థిక లాభాలు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

కుంభ రాశి

సూర్యుడి సంచారం కుంభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో వచ్చిన సమస్యలు తగ్గిపోతాయి. మీ ప్రతిభతో ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి.

WhatsApp channel