శుక్ర, సూర్యుల నీచభంగ రాజయోగం, ఈ మూడు రాశులకు లక్కే లక్కు.. డబ్బు, అనందం దేనికీ లోటు ఉండదు!-sun and venus together forms neechabhanga yogam to bring immense wealth happiness luck to these three rasis check now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శుక్ర, సూర్యుల నీచభంగ రాజయోగం, ఈ మూడు రాశులకు లక్కే లక్కు.. డబ్బు, అనందం దేనికీ లోటు ఉండదు!

శుక్ర, సూర్యుల నీచభంగ రాజయోగం, ఈ మూడు రాశులకు లక్కే లక్కు.. డబ్బు, అనందం దేనికీ లోటు ఉండదు!

Peddinti Sravya HT Telugu

అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా అదే రాశిలో ఉండడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక మార్పులను చూస్తారు. చాలా విధాలుగా కలిసి వస్తుంది.

శుక్ర, సూర్యుల నీచభంగ రాజయోగం (pinterest)

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. విలాసాలు, డబ్బు, ఐశ్వర్యం వంటి వాటికి కారకుడైన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు చెందడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. సూర్యుడు కూడా కన్యా రాశిలో ఉండడంతో ఈ యోగం ఏర్పడింది.

నీచభంగ రాజయోగం

అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా అదే రాశిలో ఉండడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక మార్పులను చూస్తారు. చాలా విధాలుగా కలిసి వస్తుంది. డబ్బుకి కూడా లోటు ఉండదు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్ర, సూర్యుల నీచభంగ రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి దేనికి లోటు ఉండదు

1.తులా రాశి:

తులా రాశి వారికి నీచభంగ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. ఎప్పటి నుంచో తీసుకోని నిర్ణయాలను ఈ సమయంలో తీసుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారు. టెన్షన్‌లన్నీ తీరిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

ఒంటరిగా ఉన్నవారికి పెళ్లి ఘడియలు సమీపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్‌లు వంటివి చూస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

2.కన్యా రాశి:

కన్యా రాశి వారికి ఈ యోగం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. పని ప్రదేశంలో బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ప్రేమ జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకీ ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

3.వృశ్చిక రాశి:

రాశి వారికి నీచభంగా యోగం అనేక విధాలుగా కలిసివస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో, వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో మధురత ఉంటుంది. స్నేహితులు, బంధువుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.