జూన్ 15 ఆదివారం నాడు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో పాటుగా 12 ఏళ్ల తర్వాత గురువుతో సంయోగం చెందుతాడు. ఈ సమయంలోనే రాహువు రెండు గ్రహాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది.
రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. దీంతో రాహువు పంచమ దృష్టి ప్రభావం రెండు గ్రహాలపై పడుతుంది. గురువుతో, సూర్యుడుతో రాహువుకి శత్రు సంబంధం ఉండడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఐదు రాశులు వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌లో కూడా సమస్యలు రావచ్చు. మరి ఈ సమయంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి?, ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
మకర రాశి 6వ ఇంట్లో గురువు, సూర్యుడు సంయోగం జరుగుతుంది. దీంతో శత్రువుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు వంటి విషయాల్లో తీసుకోవాలనుకుంటే కొంత సమయం ఆగడం మంచిది. ఒకవేళ ఈ సమయంలో రుణాలు తీసుకుంటే తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్యుడు, గురువు కలయిక 12వ ఇంట్లో జరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. అనవసరంగా డబ్బులు వృథా అవుతాయి. ఆకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. ఆదా చేసిన సంపాదన మొత్తం కరిగిపోతుంది. విదేశీ పర్యటనలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
సింహ రాశి వారికి సూర్యుడు, గురువు సంయోగం చెందడంతో కొంతమేరకు ఇబ్బందులు వస్తాయి. సోదరులతో ఇబ్బందులు రావచ్చు. మీ ప్రతిని తగ్గే పనులు చేయడం మంచిది కాదు. కొన్ని అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. కొన్ని విషయాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.
మీన రాశి వారికి సూర్యుడు, గురువు కలయిక నాలుగవ ఇంట్లో జరగడంతో డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వాహనాలు, ఇతర వస్తువుల కోసం డబ్బుని ఖర్చు చేస్తారు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. వివాహితులకు ఈ కాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదాలు ఎదుర్కొంటారు.కొంతమేరకు భావోద్వేగానికి లోనవ్వడం వలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.